Natyam ad

ఆక్వా రైతుల కీలక నిర్ణయం.. నో క్రాప్ హాలిడే

ఏలూరు ముచ్చట్లు:


తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆక్వా రైతులు ప్రభుత్వాన్ని కోరారు. నిపుణుల సూచన మేరకు ఆక్వారంగంలో క్రాఫ్ హాలిడే నిర్ణయాన్ని రైతులు విరమించుకున్నారు. ఆక్వా సంక్షోభం సమయంలో క్రాఫ్ హాలిడేకు వెళితే నష్టపోతామని సీఫుడ్ ఎక్స్ పోర్టర్స్ సూచనలకు రైతులు తలోగ్గారు. ఏపీలో ఆక్వా సంక్షోభం నేపథ్యంలోని రాజమండ్రిలో రైతులతో సీఫుడ్ ఎక్స్ పోర్టర్స్ నిర్వహించిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈసమావేశానికి 70 మంది ఎక్స్ పోర్టర్లు, గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 300 మంది ఆక్వా రైతులు హాజరయ్యారు. రానున్న రెండు నెలల కాలంలో సంక్షోభం సమసి పోతుందని అభిప్రాయపడ్డారు. అంతవరకు క్రాప్ తగ్గించుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ సీఎం జగన్ ఆదేశాల మేరకు రైతులతో సమావేశం అయ్యామని అన్నారు.ఈ సంక్షోభం తాత్కాలికమేనని రెండు మూడు నెలల్లో అంతర్జాతీయంగా ఆక్వా పరిస్థితి మెరుగుపడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులు ఆక్వా క్రాప్ హాలిడే ఆలోచన లేదన్నారు. 30 కౌంట్ రొయ్యలు పండించమన్నామని తెలిపారు.రైతులతో ప్రతిపక్షాలు రాజకీయం చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఇకపై రైతులతో తరచుగా సమావేశం అవుతామని వెల్లడించారు. ఎక్స్ పోర్టర్స్ అధ్యక్షుడు అల్లూరి ఇంద్రకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇకపై రొయ్యలు కొనుగోలు చేస్తామని ప్రకటించారు.30 కౌంట్ రూ.380కి 100 కౌంట్ 210 రూపాయలకు కొనుగోలు చేస్తామని అన్నారు. అంతర్జాతీయంగా వచ్చిన సమస్యతో ఏపీలో ఆక్వా సంక్షోభం వచ్చిందని అంటున్నారు.

 

Tags: Key decision of aqua farmers.. No crop holiday

Post Midle
Post Midle