కే.జీ సారధి కన్నుమూత

హైదరాబాద్  ముచ్చట్లు:


సీనియర్ హాస్యనటుడు కె.జె. సారథి (83) కన్నుమూశారు. కిడ్నీ, లంగ్స్ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నెల రోజులుగా హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ హాస్పటిటల్‌లో చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయం 2గంటల 32 నిమిషాలకు మృతి చెందారు. ఆయన పూర్తి పేరు కడలి విజయ సారథి. 1942 జూన్ 26న పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో ఆయన జన్మించారు. దాదాపు 350 పైగా చిత్రాలలో నటించడమే కాకుండా.. నిర్మాతగా మారి రెబల్ స్టార్ కృష్టంరాజు తో ‘ధర్మాత్ముడు, అగ్గిరాజు, శ్రీరామ చంద్రుడు, విధాత’ వంటి చిత్రాలను నిర్మించారు. కె.జె. సారథి మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. నివాళులు అర్పిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ మహాప్రస్థానంలో ఆయన అంత్య క్రియలు జరగనున్నాయి.

 

Tags: KG Saradhi passed away

Post Midle
Post Midle