ఖైరతాబాద్‌ టిక్కెట్‌ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తా: దానం

Date:09/11/2018
హైదరాబాద్‌  ముచ్చట్లు:
రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు చేసినా చివరకు  వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి దానం నాగేందర్‌ పేర్కొన్నారు. మహాకుటమి వల్ల తెరాసకు కలిగే నష్టం ఏమీ లేదని దానం స్పష్టం చేసారు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని… కానీ ఇక్కడ కూటమి పేరుతో కుట్రలు చేస్తే మాత్రం సహించేది లేదన్నారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు నేతలు శుక్రవారం దానం సమక్షంలో తెరాసలో చేరారు.ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌ టిక్కెట్‌ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తానని దానం స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రకటించిన జాబితాలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీకి తిరిగి అధికారం తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారు తెరాస ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారన్నారు. రాష్ట్రంలో 75శాతం మంది ప్రజలు మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు సర్వే తేలిందని దానం చెప్పారు.
Tags: Khaidatabad ticket to anyone who works together: donate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *