ఖమ్మం జిల్లా…ఎవరి ఖిల్లా 

Date:09/11/2018
ఖమ్మం ముచ్చట్లు:
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని జిల్లాలు, నియోజకవర్గాలపై ఎట్ న్యూస్ రిపబ్లిక్  స్పెషల్ రిపోర్ట్ అందిస్తోంది. రణరంగాన్ని తలపిస్తున్న తెలంగాణ రణక్షేత్రాన్ని మీముందుంచుతోంది . లెటజ్ వాచిట్.ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాల వివరాలను మీకందిస్తున్నాం.
నియోజకవర్గాల గురించి తెలుసుకునే ముందు జిల్లా ప్రత్యేకతలేంటో చూద్దాం. గతంలో కొత్తగూడెం పట్టణం ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజనుగా ఉంది. అయితే 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటైంది.
అక్టోబర్ 11న ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి పేరుతో ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు, 377 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు గతంల్ ఖమ్మం జిల్లాలో ఉండేవి. కొత్త జిల్లా జనాభాలోనూ.. విస్తీర్ణంలోనూ.. అతిపెద్ద జిల్లాగా ఆవిష్కరించింది. శ్రీరాముడు కొలువైన క్షేత్రం భద్రాచలం ఈ నియోజకవర్గంలోనే ఉంది.
ప్రతీయేడాది శ్రీరామనవమికి  వైభవంగా నిర్వహించే సీతారామ కల్యాణ ఉత్సవానికి భక్తులు తరలివస్తారు. ఇక్కడి సింగరేణి కాలరీస్ కంపెనీ ఉండటంతో దీన్ని భారతదేశపు బొగ్గు పట్టణం అని కూడా పిలుస్తారు. కొత్తగూడెం ,పాల్వంచలు ట్విన్ సిటీస్ గా ఉంటున్నాయి. కొత్తగూడెం చుట్టుపక్కల అడవులు, పరిశ్రమలు, అందమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి.
Tags: Khammam District … Whose Killa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *