ఖమ్మం టీఆర్ఎస్ లో ముదిరిన వర్గపోరు
ఖమ్మం ముచ్చట్లు:
శుక్రవారం సత్తుపల్లి లో రాజ్యసభ కు ఎన్నికైన బండి పార్థసారథి రెడ్డి,వద్దిరాజు రవిచంద్ర కు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. సన్మాన కార్యక్రమానికి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ఆహ్వానం అందకపోవడం చర్చకు దారి తీసింది. తుమ్మల, పొంగులేటి ని టీఆర్ఎస్ పక్కన పెట్టిందనే చర్చ జరిగింది. భారీ ఎత్తున నిర్వహించిన కార్యక్రమంలో కీలక నేతలు అయిన తుమ్మల, పొంగులేటి ని పిలవకపోవడంపై తుమ్మల, పొంగులేటి అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిలవకుండా ఎలా వెళ్తానని తుమ్మల ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తుమ్మల, పొంగులేటి కి జరిగిన అవమానం పై వారి అనుచరులు రగిలిపోతున్నారు.
Tags: Khammam is an advanced class war in TRS

