Kharif awareness seminars for farmers from 4

4 నుంచి రైతులకు ఖరీఫ్‌ అవగాహన సదస్సులు

Date:03/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని 21 ఆర్‌బికె కేంద్రాలలోని రైతులకు ఖరీఫ్‌ పంటలపై అవగాహన సదస్సులను గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఏవో సంధ్య తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ఉదయం 8 గంటలకు పాలెంపల్లి, 11 గంటలకు మోదుగులపల్లె, 2:30 గంటలకు సుగాలిమిట్టలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తారు. అలాగే 5న చండ్రమాకులపల్లె, ఈడిగపల్లె, భీమగానిపల్లె, 6న నెక్కుంది, బండ్లపల్లె, ఏతూరు, 8న కుమ్మరనత్తం, గుడిసెబండ, చదళ్ల, 9న మంగళం, మాగాండ్లపల్లె, కుమ్మరగుంట, 10న వనమలదిన్నె, ఆరడిగుంట, సింగిరిగుంట, 11న పట్రపల్లె, నేతిగుట్లపల్లె, రాగానిపల్లె ఆర్‌బికెలలో సదస్సులు నిర్వహించనున్నట్లు ఏవో తెలిపారు. ఈ సదస్సులను రైతులు హాజరై తగిన సలహాలు, సూచనలు పొంది, రైతుల సమస్యలను తెలియజేయాలని ఏవో కోరారు.

జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 329 – కలెక్టర్ భరత్

Tags: Kharif awareness seminars for farmers from 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *