అమ్మ స్థానం కోసం ఖుష్బూ…?

Date:18/01/2021

చెన్నై ముచ్చట్లు:

తమిళనాడు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఒక కూటమిలో ఉన్నా పదవుల కోసం తాపత్రయం మాత్రం ఎవరినీ వదిలిపెట్టడం లేదు. జయలలిత లేని నాయకత్వాన్ని అందుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. జైలుకెళ్లిన శశికళ ఎటూ జయలలిత వారసురాలిని తానే అని ఎటూ ప్రకటించుకుంటారు. ఇక తాజాగా బీజేపీ నేత ఖుష్బూ సయితం జయలలిత స్థానాన్ని తాను భర్తీ చేస్తానని ఆమె ప్రయత్నం చేస్తున్నారు.తమిళనాడు వ్యాప్తంగా ఖుష్బూకు అభిమానులున్నారు. ఖుష్బూకు గుడి కట్టిన పిచ్చి అభిమానం వారిది. అలాంటి ఖుష్బూ గత కొంతకాలంగా రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేేస్తున్నారు. కాంగ్రెస్ లో ఎక్కువ కాలం ఉన్నప్పటికీ ఎలాంటి పదవి దక్కలేదు. గుర్తింపు లభించినా కాంగ్రెస్ లో భవిష్యత్ ఉండదని భావించిన ఖుష్బూ ఇటీవల బీజేపీలో చేరారు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఖష్బూ ఏదో ఒక పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు.అయితే తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలోనే బీజేపీ ఉంది.

 

 

 

వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నాడీఎంకే పళనిస్వామిని ప్రకటంచింది. అయితే దీనికి బీజేపీ అభ్యంతరం తెలుపుతుంది. కూటమిని కట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని నిలదీస్తుంది. ఎన్నికల ఫలితాల తర్వాతే ముఖ్యమంత్రి ఎవరనేది శాసనసభ్యుల అభిప్రాయం మేరకు జరగాలని బీజేపీ పట్టుబడుతుంది. దీని వెనక ఖుష్బూ ఉన్నారని చెబుతున్నారు.అన్నాడీఎంకేలో సమర్థవంతమైన నాయకత్వం లేదు. చరిష్మా కలిగిన లీడర్లు కూడా లేరు. దీంతో అన్నాడీఎంకే కూటమి గెలిస్తే తాను కీలక పదవి పొందవచ్చని ఖుష్బూ భావిస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఖుష్బూ పర్యటిస్తున్నారు. ఆమె సభలకు కూడా జనం పోటెత్తుతుండటం తో అన్నాడీఎంకే సయితం ఖుష్బూ పై ఆధారపడిందంటున్నారు. అయితే అన్నాడీఎంకే మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో పక్కాగానే ఉంది. కూటమికి తామే నేతృత్వం వహిస్తున్నామని, తమ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చెబుతుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే కూటమిలో విభేదాలు పదవి కోసం బయలుదేరాయి.

కొవిడ్ వ్యాక్సిన్  నిరంత‌రం కొన‌సాగే ప్ర‌క్రియ: మంత్రి ఈట‌ల

Tags:Khushboo for Amma position …?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *