టీడీపీ పార్టీకి కి ఎల్. రమణ రాజీనామా

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. మూడంటే మూడే వాఖ్యాలతో తన రాజీనామా లేఖను ముగించారు. 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు ధన్యవాదాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎల్లుండి టీఆర్‌ఎస్‌లో రమణ చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరింత చేరువగా.. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని తను నిర్ణయించుకున్నట్లు రమణ తెలిపారు.కాగా.. గురువారం నాడు టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ఎల్‌ రమణ భేటీ అయిన విష‌యం విదిత‌మే. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఆయన ప్రగతిభవన్‌కు వచ్చి కేసీఆర్‎ను కలిసారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో గంటకు పైగా వీరి మధ్య చర్చలు జరిగాయి. గత ఏడేండ్లలో స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు వివరించారు. దేశంలో వివిధ రాష్ర్టాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ర్టాల్లో జరిగిన పరిణామాలు.. తెలంగాణలో జరుగుతున్న ప్రగతిపై సీఎం కేసీఆర్‌ విడమరచి చెప్పారని ఆయన తెలిపారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Ki L to the TDP party. Ramana resigns

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *