Kick off the polio epidemic

పోలియో మహమ్మారిని తరిమికొట్టండి

– కొండవీటి నాగభూషణం

Date:19/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

చిన్నపిల్లలకు ప్రాణాంతకంగా మారుతున్న పోలియో మహమ్మారి వ్యాది నుంచి పిల్లలను కాపాడుకోవాలని , ఇందుకోసం ప్రతి ఒక్కరు ఉధ్యమించాలని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలో పోలియో కార్యక్రమాన్ని మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సోనియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగభూషణం పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పోలియోవ్యాదిని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన పిల్లలందరికి పోలియో చుక్కలను క్రమం తప్పకుండ వేయించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే పిల్లల మనుగడకు ఇబ్బందికరమౌతుందన్నారు. పోలియో చుక్కలు విషయం తెలియని వారికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, ఆర్టీసి మజ్ధూర్‌ సంఘ అధ్యక్షుడు జయరామిరెడ్డి, ముస్లిం మైనార్టీల సీనియర్‌ నాయకుడు బిటి అతావుల్లా, డాక్టర్లు ఆనందరావు, పవిత్రన్‌, ప్రవీన్‌ , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ విరుద్ధం – పౌరసత్వ సవరణ చట్టం

Tags: Kick off the polio epidemic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *