కిడారి హత్య కుసులో  ఉన్నమీనా హత్య

Kidari murder killer killed me

Kidari murder killer killed me

 Date:12/10/2018
విజయనగరం ముచ్చట్లు:
ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్య తర్వాత ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు జల్లెడపడుతున్నారు. తాజాగా శుక్రవారం ఏఓబీలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్ట్ మృతిచెందిన విషయం తెలిసిందే. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా అండ్రపల్లి వద్ద పోలీసులకు మావోయిస్టు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో హతమైన మహిళా మావోయిస్ట్ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యలో పాల్గొన్న మీనాగా గుర్తించారు. బెజ్జింకి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన బలగాలు కాల్పులు జరపడంతో మీనా ప్రాణాలు కోల్పోయింది.
హతమైన మీనాను గాజర్ల రవి అలియాస్ గణేశ్ భార్యగా గుర్తించిన పోలీసులు, ఆమె స్వస్థలం వరంగల్ అని వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ మరో నలుగురు మావోయిస్టులు కూడా పట్టుబడినట్టు తెలిపారు. వారిని జయంతి, రాధిక, గీత, రాజశేఖర్ రాజశేఖర్‌కర్మగా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. వీరంతా మావోయిస్టు పార్టీ దళ కమాండర్లుగా భావిస్తున్నారు. కిడారి, సోమ హత్యల తర్వాత ఏఓబీలో మావోయిస్టుల ఏరివేతకు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్ర, ఒడిశాలు ఒక అవగాహనకు వచ్చాయి.
ఇందులో భాగంగానే గత ఆదివారం ఒడిశా ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేతలు తృటిలో తప్పించుకున్నారు. వారిలో అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే, చలపతి అలియాస్‌ రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి, అరుణ అలియాస్‌ వెంకటరవి చైతన్యలు ఉన్నారు.
Tags:Kidari murder killer killed me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *