4 నెలల తర్వాత కిడ్నాపర్ అరెస్ట్

తిరుపతిముచ్చట్లు:

తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ ఆలయం సమీపంలో పోలీసులను చూసిన ఓ లారీ డ్రైవర్ కంగారుపడిపోయాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించడంతో అనుమానించిన పోలీసులు అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయమేంటని వారి స్టైల్లో ఆరా తీయడంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల కిందట సంచలనం రేపిన కిడ్నాప్ కేసు పరిష్కారమైంది. తిరుపతిలో కిడ్నాప్‌కి గురైన బాలుడిని అపహరించింది అతనేనని తెలియడంతో పోలీసులు షాకయ్యారు. తీరా అతను చెప్పిన సమాధానం విని కంగుతిన్నారు.నాలుగు నెలల కిందట ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తమ్ కుమార్ సాహూ కుటుంబం దైవ దర్శనానికి తిరుమల విచ్చేసింది. తిరుపతిలోని బాలాజీ లింకు బస్టాండ్ ఉత్తమ్ కుమారుడు శివం సాహూ(6) కనిపించకుండా పోయాడు. కంగారుపడిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో బాలుడిని కిడ్నాప్ చేసినట్లు తేలింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఆరేళ్ల చిన్నారిని దుండగుడు అపహరించాడని తెలియడంతో మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి.పోలీస్ యాక్షన్ సీరియస్‌గా ఉంటుందని భయపడిన కిడ్నాపర్ బాలుడిని విజయవాడలోని దుర్గ గుడి వద్ద వదిలేసి పారిపోయాడు. బాలుడు ప్రాణాలతో దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ కిడ్నాప్ చేసిన నిందితుడి కోసం పోలీపులు గాలిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన తిరుపతి హరేరామ హరేకృష్ణ ఆలయం వద్ద పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన కర్ణాటకలోని ముళబాగల్ తాలూక పుట్టణహళ్లికి చెందిన శివప్రసాద్ అలియాస్ శివారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పారిపోతున్నావంటూ తమ స్టైల్లో విచారించడంతో బాలుడి కిడ్పాప్ కేసు మిస్టరీ వీడిపోయింది. బాలుడు శివం సాహూని కిడ్పాప్ చేసింది తానేనని.. చనిపోయిన తన చిన్నకొడుకులా ఉన్నాడని బాలుడిని అపహరించినట్లు చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుడు లారీ డ్రైవర్ కావడంతో హిందీతో మాట్లాడి బాలుడిని ఆకర్షించి తనతో తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Kidnapper arrested 4 months later

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *