Natyam ad

మెదక్ జిల్లాలో వ్యక్తి  కిడ్నాప్.. హత్య

మెదక్ ముచ్చట్లు:

 

 

 

మెదక్ జిల్లా శివ్వంపేట పరిధిలో ఒక వ్యక్తి కిడ్నాప్ కు గురయి తరువాత హత్యకు గురికావడం కలకలం రేపింది. స్థానికంగా వుంటున్న అంజనేయులు (50) ఈనెల 11 న పని కోసం వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తితెలియను వ్యక్తులు అంజనేయలును కిడ్నాప్ చేసారు.
ఆదేరోజు 1అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున వరకు 40 సార్లు  ఆంజనేయులు ఫోన్ నుంచి  కుటుంబ సభ్యులకు దుండగులు  ఫోన్ చేసారు. మీ ఇంట్లో ఉన్న 7 లక్షల నగదు, మూడు తులాల బంగారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. మేడ్చల్ జిల్లా షామిర్ పేట్ కి తెచ్చి ఇవ్వకపోతే మీ నాన్నని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. భయపడి డబ్బులు, నగదు ఇస్తాం అని మా నాన్నని ఎం చేయవద్దంటు మృతుడి భార్య, కూతుళ్లు
వేడుకున్నారు. కిడ్నాప్ సమాచారం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేసారు. అయినా పోలీసులుపట్టించుకోలేదని బాధిత కుటుంబం ఆరోపించింది.  వారు మూడు జిల్లాల్లోని 4 పోలీస్ స్టేషన్లు తిరిగారు.   ఫిర్యాదు చేయడానికి ఆదివారం గజ్వేల్, షామిర్ పేట్, మనోహరబాద్, శివ్వంపేట పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. చివరకు శివ్వంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉండగానే మీరు డబ్బు, నగలు ఇచ్చేలా లేరు మీ నాన్నని చంపేస్తున్నాం ఈ సిమ్ కూడా తీసేస్తున్నాం అని కిడ్నాపర్లు ఫోన్ చేసినట్లు సమాచారం. చివరకు  కిడ్నపర్లు
సోమవారం రాత్రి  దొంతి చెరువులో తలపై తీవ్ర గాయాలతో ఆంజనేయులు మృతదేహం లభ్యం అయింది. పోలీసులు ముందే స్పందించి ఉంటే తమ తండ్రి బతికిఉండేవాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Post Midle

Tags;Kidnapping and murder of a person in Medak district

Post Midle