సినీ ఫక్కిలో బాలుడి కిడ్నాప్….. సుఖాంతం

Date:23/10/2020

ములుగు ముచ్చట్లు:

ములుగు జిల్లా లో మరో నాలుగు నెలల బాబు కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. వెంకటాపురం మండల సూరవీడులో  ఈ ఘటన జరిగింది. సీనీఫక్కీలో గుర్తుతెలియని వ్యక్తుల  నాలుగు నెలల బాబు ను ఎత్తుకెళ్లారు. అయితే, అదృష్టవశాత్తు అర్ధరాత్రి అపహరించిన బాబుని స్థానికులు ఛేజ్ చేసి రక్షించారు. దుండగులను పట్టుకున్నారు. వాహనాన్ని, బాబు ను, ఎత్తుకెళ్లిన వ్యక్తులను  , బాలుడ్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలుడి దత్తత  తల్లి నాగేశ్వరి కి బాబును అప్పగించారు. వివరాలు ఇలా వున్నాయి. నాగేశ్వరీ నాలుగు నెలలక్రితం బాలుడిని దత్తత  తీసుకుంది.  దత్తత ఇచ్చినవారే ఈపని చేసి ఉంటారని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు  చేసింది. నాగేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. ప్రేమ పెళ్లి చేసుకుని ఇంట్లో వారు కాదనడంతో ఏడు నెలల గర్భిణిగా నాగేశ్వరిని  స్నేహ-మహేందర్ దంపతులు ఆశ్రయించారు. తరువాత స్నేహకు నాగేశ్వరీ కాన్పు చేసింది. పుట్టిన మగశిశువును తల్లిదండ్రులు వద్దనడంతో  నాగేశ్వరీ దత్తత తీసుకుంది. అర్థరాత్రి నాగేశ్వరిపై దాడి చేసి, కళ్లలో కారం చల్లి బాలుడిని  దుండగులు ఎత్తుకెళ్లారు. స్నేహ,మహేందర్ దంపతులకు చెందిన వారే ఈ ఘటనకు పాల్పడ్డారని  పోలీసులు అనుమానిస్తున్నారు.

రైతుల ఆరెస్టు

Tags:Kidnapping of a boy in a movie .. Happy ending

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *