డిజాస్టార్ గా నిలుస్తున్న కియారా 

Date:20/05/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి దూసుకొచ్చిన గ్లామర్ కెరటం కియారా అద్వానీ.. తెలుగులో మహేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. మహేష్ భరత్ అనే నేను లో మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఆకట్టుకున్న కియారా అద్వానీ.. వినయ విధేయరామాలోను గ్లామర్ గా ఆకట్టుకుంది. కానీ వినయ విధేయరామ డిజాస్టర్ అవడంతో కియారకి తెలుగులో ఛాన్స్ లు సన్నగిల్లాయి. కానీ అమ్మడు బాలీవుడ్ లో ఇప్పుడు టాప్ పొజిషన్ కి రావడానికి ట్రై చేస్తుంది. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ కి జోడిగా డి గ్లామరస్ గా సెక్సీ గా కనిపించబోతుంది. బోల్డ్ గా రెచ్చిపోయి నటిస్తున్న కియారకు కబీర్ సింగ్ బ్రేకివ్వడం ఖాయంగా కనబడుతుంది.ఇక కియారా ఎప్పటికప్పుడు తన అందాలను సోషల్ మీడియా ద్వారా ఫోటో షూట్స్ రూపంలో చూపిస్తూనే ఉంది.

 

 

 

 

బాలీవుడ్లో నాలుగైదు సినిమాల్తో బిజీగా వున్న కియారా అద్వానీ ప్రస్తుతం కబీర్ సింగ్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఇక తాజాగా అమ్మడు ఒక మ్యాగజైన్ కోసం చేసిన హాట్ ఫోటో షూట్ ని చూస్తే కియారా లో ఇంతందం దాగుందా అని అనిపించక మానదు. పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం కియరా చేసిన హాటెస్ట్ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై కియరా ఇచ్చిన హాటెస్ట్ ఫోజుకి కుర్రకారుకి గుండె లయ తప్పడం ఖాయం. గ్లామర్ డ్రెస్ లో కిక్కేంచే ఫోజులో… క్లివేజ్ షో తో కియారా చూసిన చూపుకి యూత్ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతారు. మరి కియారా కైపెక్కించే ఆ ఫోటో షూట్ తో బాలీవుడ్ మాత్రమే కాదు… సౌత్ ఇండస్ట్రీ కూడా ఫిదా అవుతుంది. మరి ఇప్పటికే బాలీవుడ్ లో బోలెడన్ని సినిమాలు చేస్తున్న కియారా ఇలాంటి ఫొటోస్ షూట్స్ చేపించుకుంటే సౌత్ మూవీస్ లోను బిజీ కావడం ఖాయమే.

 

 

ఎన్నికలు ముగిశాయి… ఆరోపణలు మిగిలాయి

 

Tags; Kijara, which is a decader

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *