Natyam ad

సీఐడీ విచారణకు కిలారు రాజేష్

విజయవాడ ముచ్చట్లు:


ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే తెలుగుదేశం పార్టీని అధినేత చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో కిలారు రాజేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈరోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిఐడి కార్యాలయానికి హాజరయ్యారు.. ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ రెండు రోజుల కిందట కిలారు రాజేశ్ కు సీఐడీ అధికారులు 41సీఆర్పీసీ కింద నోటీసులు అందించారు..మరోవైపు కిలారు రాజేశ్ టీడీపీ యువనేత నారా లోకేశ్ కు సన్నిహితుడు అని వైసీపీ నేతలు చెపుతున్న సంగతి తెలిసిందే. రాజేశ్ విదేశాలకు పారిపోయారని ఇటీవల ప్రెస్ మీట్ లో సీఐడీ అధికారులు చెప్పారు. దీనిపై రాజేవ్ స్పందిస్తూ… తాను విదేశాలకు పారిపోలేదని చెప్పారు. తాను ఏపీలోనే ఉన్నానని తెలిపారు. సీఐడీ విచారణకు సహకరిస్తానని చెప్పారు.ఇంకోవైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును రాజేశ్ ఆశ్రయించారు. గత శుక్రవారం ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. అయితే, రాజేశ్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదని… ఆయనను అరెస్ట్ చేయబోమని, 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని కోర్టుకు సీఐడీ తెలిపింది. అరెస్ట్ లేనందువల్ల ముందస్తు బెయిల్ పై ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు వెల్లడించింది.

 

Tags: Kilaru Rajesh for CID investigation

Post Midle
Post Midle