జూన్  13న కింగ్ నాగార్జున `మ‌న్మ‌థుడు 2` టీజ‌ర్‌

King Nagarjuna is the "Cupid 2" teaser on June 13th

King Nagarjuna is the "Cupid 2" teaser on June 13th

Date:11/06/2019

కింగ్ నాగార్జున హీరోగా మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) నిర్మాత‌లు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఒక షెడ్యూల్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు నాగార్జున‌- ర‌కుల్‌, నాగార్జున‌- కీర్తిసురేష్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. సినిమాపై ఇప్ప‌టికే మంచి అంచ‌నాలున్నాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా జూన్ 13న ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు.
మ‌న్మ‌థుడు ఇన్‌స్పిరేష‌న్‌తో, రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫ‌న్ రైడ‌ర్ తెర‌కెక్కుతోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
న‌టీన‌టులు: కింగ్ నాగార్జున‌ ర‌కుల్ ప్రీత్ సింగ్‌ ల‌క్ష్మి వెన్నెల‌కిషోర్‌ రావు ర‌మేష్‌ ఝాన్సీ దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు.

 

బడిబాట కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలి సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

Tags:King Nagarjuna is the “Cupid 2” teaser on June 13th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *