కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ ఎల్‌ పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌ టైన్‌మెంట్స్ `ది ఘోస్ట్` ప్రోమో విడుద‌ల‌

హైదరాబాద్ ముచ్చట్లు:

కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రంలో నాగార్జున ప‌ట్టుకున్న క‌త్తి (తమహాగానే) గురించి ఇండ‌స్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. చాలా ప‌దునైన ఆ ఆయుధం యాక్ష‌న్ స‌న్నివేశాల్లో నాగ్ ఉప‌యోగించిన తీరు అక‌ట్టుకుంది. ఇప్పుడు ఆ తమహాగానే గురించి ది ఘోస్ట్ మేకర్స్ అస‌లు అది ఎలా తయారు చేయబడిందో వెల్లడించడానికి ఈరోజు ప్రోమోతో ముందుకు వచ్చారు.
ప్రోమో ఎలావుందంటే,దర్శకుడు ప్రవీణ్ సత్తారు తొలిసారిగా ఇలాంటి సబ్జెక్ట్‌తో నాగార్జునని ఇంటర్‌ పోల్ ఆఫీసర్‌ గా చూపించనున్నారు. ప్రోమో… వాస్తవానికి నాగార్జున కోసం వచ్చే అండర్ వరల్డ్ గురించి ఎవరో హెచ్చరించడంతో ప్రారంభమవుతుంది. `రానీ` అంటూ నాగార్జున న‌డుచుకుంటూ వ‌చ్చి  ‘రెడ్ నోటీసు’ అనే ఫైల్‌ను చూస్తాడు. అందులో అండర్ వరల్డ్‌ కు సంబంధించిన అన్ని రహస్యాలు స్పష్టంగా ఉన్నాయి.అప్పుడు, నాగార్జున ఒక భారీ పెట్టెను తెరిచాడు, అక్కడ అతను తమహాగానే అనే ఈ ముడి ఉక్కును కనుగొంటాడు. ఎర్ర‌గా కాల్చి దానితో పదునైన కత్తిని తయారు చేస్తాడు. “కత్తి రాజు చేతిలో గర్వంగా ఉంది” అని ప్రోమోలోని కోట్ చూపుతుంది. నాగ్ ఆ క‌త్తితో కొట్ట‌గానే ఓ వ‌స్తువు రెండు ముక్కలుగా కట్ అవుతుంది. అది క‌త్తి  పదును అది చూపుతుంది.

 

 

అండర్ వరల్డ్ స్థానానికి చేరుకున్నప్పుడు, నాగ్‌ విద్యుత్ సరఫరా వ్యవస్థను పేల్చివేస్తాడు. చివరగా, తమహాగానే శత్రువులపై దాడి చేయడానికి ఘోస్ట్ సిద్ధంగా ఉంది. తమహగనే అనేది జపనీస్ సంప్రదాయంలో తయారు చేయబడిన ఒక రకమైన ఉక్కు. దీనితో వారు కత్తులు త‌యారుచేస్తుంటారు. తమా అంటే విలువైనదని, హగనే అంటే ఉక్కు అని చివరికి తేలింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను ఆగస్టు 25న విడుదల చేయనున్నట్లు ప్రోమో కూడా వెల్లడించింది.
ప్రోమో అంతటా నాగార్జున అదే జోరు కొనసాగించడంతో తమహాగానే కత్తి ప్రాముఖ్యత ప్రోమో ద్వారా వెల్లడైంది. ప్రోమోలో ఉప‌యోగించిన భరత్, సౌరబ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది. వచ్చే వారం విడుదల కానున్న ట్రైలర్‌లో మరిన్ని యాక్షన్‌ లను చూడబోతున్నాం.
ఘోస్ట్ అనేది భావోద్వేగాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కథానాయిక, ఇందులో గుల్ పనాగ్ మరియు అనిఖా సురేంద్రన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ది ఘోస్ట్ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

 

Tags: King Nagarjuna, Praveen Sattaru, Sri Venkateswara Cinemas LLP, North Star Entertainments “The Ghost” Promo Release

Leave A Reply

Your email address will not be published.