శ్రీవారికి మొక్కులు తీర్చుకున్న రాజు యాదవ్

తిరుపతి ముచ్చట్లు:

అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనుండడంతో తిరుమల టిడిపి అధ్యక్షుడు సుద్దాల రాజు యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి 501 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని ఆ దేవ దేవుడికి మొక్కు కున్నమని అన్నారు. అందులో భాగంగా గురువారం పలువురు టిడిపి నాయకుల తో కలసి అఖిలాండం వద్ద 501 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నామని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం పురోభివృద్ధి చెంది, ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని, చంద్రబాబు ఆయురారోగ్యాలు ఇవ్వాలని దేవుడ్ని కోరుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ షణ్ముగం, దేవరాజు, ఆనంద్ బాబు, బాలాజీ, విశ్వనాధం, పవన్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: King Yadav paid his respects to Sri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *