Natyam ad

సోనియా కాళ్ళు పట్టుకుని సీఎం పదవిలో కిరణ్‌- ఎంపీ రెడ్డెప్ప

-స్వార్థ రాజకీయాలకు ఆధ్యుడు కిరణ్‌
– పెద్దిరెడ్డితో బడుగులకు రాజ్యాధికారం
– కిరణ్‌, చల్లాకు ఓటమి తప్పదు

పుంగనూరుముచ్చట్లు:

Post Midle

రాష్ట్రంలో స్వార్థ రాజకీయాలకు ఆధ్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి. అవసరాలకు ఊసరవళ్ళి వలే రంగులు మారడం కిరణ్‌నైజం….ముఖ్యమంత్రి పదవి కోసం సోనియా గాంధి కాళ్ళు పట్టుకోలేదా…? నీకు పెద్దిరెడ్డి కుటుంభాన్ని విమర్శించే అర్హత ఉందా.? పెద్దిరెడ్డి కుటుంబంతోనే బడుగుల అభివృద్ధి. తనకు రెండవ సారి ఎంపీ టికెట్టు ఇప్పించడంలో పెద్దిరెడ్డి కృషి మరువలేనిది అంటు చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం పట్టణంలోని నక్కబండలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి , రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో డిసిసి అధ్యక్షుడుగా పెద్దిరెడ్డి పదవి కాలంలో ఏనాడు స్వార్థ రాజకీయాలు చేయలేదని ఎంపీ తెలిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డితోనే స్వార్థం, కుటిల రాజకీయాలు ప్రారంభమైందని , పదవుల కోసం ఆస్తులు కాపాడుకునేందుకు పార్టీలు మారడం, శత్రువులతో చేతులు కలపడం లాంటి నీతిమాలిన చర్యలు కిరణ్‌ కుమార్‌రెడ్డి జీవిత చరిత్రలో మరువని ఘట్టాలని ఎద్దెవ చేశారు. సీఎంగా ఉన్న సమయంలో జిల్లాను ఎలాంటి అభివృద్ధి కిరణ్‌ చేయలేదన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకున్న నీచుడు కిరణ్‌ అని మండిపడ్డారు. రాజంపేట ఎంపీ పదవికి నామినేషన్‌ దాఖలు చేసి , బిజెపితో లబ్ధిపొందేందుకే కిరణ్‌ ఉమ్మడి పార్టీలతో కలసి సిగ్గులేకుండ పోటీ చేస్తున్నారని తెలిపారు. మిధున్‌రెడ్డి పై పోటీ చేసిన పురంధేశ్వరి, సత్యప్రభ లు ఓటమిని గుర్తు చేసుకోవాలన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని , మే 13న జరగనున్న ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డిని చిత్తుగా ఓడిస్తారని , డిపాజిట్లు కూడ రావని ఎంపీ స్పష్టం చేశారు. ఈసమావేశంలో కౌన్సిలర్లు మనోహర్‌, రేష్మా, మైనార్టీ సెల్‌ కార్యదర్శి రషీదబేగం, పార్టీ నాయకులు ఖాదర్‌బాషా, రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:Kiran-MP Reddeppa in CM post holding Sonia’s legs

 

Post Midle