ముద్దులతో ముంచెత్తిన హెబ్బాపటేల్

Kissed hebbatale

Kissed hebbatale

Date:06/08/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
కుమారి 21 F’ మూవీలో నా హైట్ 5.4, వెయిట్ 48, నా వయసు 21, ఏ.. నాకు సైట్ కొట్టడానికి ఈ ఫిగర్ సరిపోదా? నా బయోడేటా మొత్తం కావాలా? అంటూ హాల్స్ అవసరం లేకుండా లిప్‌లాప్‌లో ఉన్న ఒరిజినల్ ఫ్లేవర్ అడిగి మరీ అదేపనిగా రుచి చూసిన హెబ్బా పటేల్.. ఇదే నా ఫస్ట్ కిస్ బాగా పెట్టానా అంటూ బంపర్ హిట్ కొట్టేసింది. లవ్ అండ్ వర్జినిటీ కాన్సెప్ట్‌లో సుకుమార్ కలం జాలు వారిని ఈ చిత్రం అప్పట్లో ఓ సన్సేషనల్ హిట్ అయ్యింది. నువ్వే నా బాయ్ ఫ్రెండ్.. నీతోనే నా ఫస్ట్ కిస్.. నీతోనే అన్నీ అంటూ రాజ్ తరుణ్‌ని ఒడిలో పడుకోబెట్టుకుని మరీ ప్రేమ పాఠాలు చెప్పిన కుమారి.. ప్రజెంట్ ముద్దుల్లో బాగా ఆరితేరిపోయింది. హిట్ ఇచ్చిన కిక్ కాబోలు.. అదే పనిగా పబ్లిక్ ప్లేస్‌లో బరితెగించి ముద్దుల వర్షం కురిపిస్తుంది. హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన ‘24 కిస్సెస్’ నుండి రొమాంటిక్ టీజర్‌ను వదిలారు చిత్రయూనిట్. టీజర్ మొత్తాన్ని లిప్‌లాక్‌లతో తడిపేసింది హెబ్బా. అదేపనిగా హీరోతో గాఢ చుంభ‌నంలో మైమరిచి మునిగితేలింది. ఇక టీజర్ మధ్యలో ‘పబ్లిక్‌లో ఈ ముద్దలేంటి సుబ్బారావ్’ అంటూ ప్రేక్షకుడి పక్షాన ప్రశ్నిస్తున్నాడు రావు రమేష్. బాలీవుడ్ ట్రెండ్‌ను టాలీవుడ్‌లో కొనసాగిస్తూ.. ఈ మధ్య కాలంలో లిక్ లాక్ సన్నివేశాలు ఉన్న సినిమాలు తెలుగులో విరివిగా వస్తున్నాయి. అర్జున్ రెడ్డి చిత్రంతో ఊపందుకున్న లిప్‌లాక్‌లు చాలా సినిమాల్లో మస్ట్‌గా మారాయి. ఈ వారం విడుదలైన చి.ల.సౌ, గూఢచారి చిత్రంల్లో సైతం లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. అయితే సినిమాల్లో లిప్ లాక్ ఉండటం అనేది కామన్‌గా మారిన సందర్భంలో లిప్ లాక్‌లను సినిమా టైటిల్‌గా మార్చుకుని ‘24 కిస్సెస్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకు ‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అంటూ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. దీన్ని బట్టి ‘24 కిస్సెస్’ మూవీలో అంతా ముద్దుల ఉత్సవం అని చెప్పకనే చెబుతున్నాడు దర్శకుడు. ‘మిణుగురులు’లాంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన అయోధ్య కుమార్ క్రిష్ణం శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సిల్లీమొంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో హెబ్బా పటేల్ ‘24 కిస్సెస్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:Kissed hebbatale

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *