కిట్లు దారి కిట్లుదే…. ఆగని సిజరేయన్లు

హైదరాబాద్ ముచ్చట్లు:

ఆరోగ్యం మ‌హాభాగ్యం అన్నారు. ప్ర‌జ‌లు ఆరోగ్యంగా వుంటే పాల‌కుల‌కూ మంచిదే. ప్ర‌జారోగ్య సంర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేకించి వ్య‌యం చేయ‌డం, ఆస్ప‌త్తులు, వ‌స‌తులు అభివృద్ధి చేయ‌డం ప్ర‌భుత్వం చేప‌ట్ట‌వ‌ల‌సిన క‌నీస ధ‌ర్మం. గెలిపించినందుకు ప్ర‌జ‌ల ఆరోగ్యానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన బాధ్య‌తా స్వీక‌రించాలి. కేవ‌లం ప్ర‌చార ఆర్భాటాల‌తో సాగిపోతున్న కేసీఆర్ ప్ర‌భుత్వం నిజానికి తెలంగాణాలో ఆస్ప‌త్రుల అభివృద్ధి విష యంలో నిర్ల‌క్ష్యం చేస్తోంద‌నేది తేటతెల్ల‌మ‌యింది. తెలంగాణా ప్ర‌భుత్వం కేసీఆర్ కిట్ పేరిట బాలింత‌ల కు ఇవ్వడం గొప్ప‌గా ప్ర‌చారం చేసుకుంది.  వాస్త‌వంలో ప‌రిస్థితులు అందుకు భిన్నంగానే  వున్నాయి. ప్ర‌భుత్వాస్ప త్రులు పేదల‌కు ఎల్ల‌పుడూ అన్ని వ‌స‌తుల‌తో అందుబాటులో వుంటాయ‌ని, ఎవ్వ‌రూ ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు వెళ్ల‌వ‌ల‌సిన అవ‌స‌రం వుండ ద‌ని ప్ర‌చారం చేసుకుంది.  ఇటీవ‌ల ఒక స‌ర్వే ప్ర‌జారోగ్య విష‌యంలో దేశంలో ఏ రాష్ట్రం ఎలా వుంద‌న్న‌ది వెలుగులోకి తెచ్చింది.  అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణాలోనే సిజ‌రియ‌న్ ఆప‌రేష‌న్లు అధికంగా  జ‌రుగు తున్న సంగ‌తి తేట‌తెల్లం చేసింది.ప్రయివేటు ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 98శాతం వరకు సీ సెక్షన్లే ఉండడం గమనార్హం. డెలివరీ కోసం చేసే సీ సెక్షన్‌ సర్జరీల్లో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉంది. తెలంగాణలో జరిగే ప్రసవాల్లో 60.7 శాతం సిజేరియన్లే. ఇది దేశ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. తెలంగాణ తర్వాతి స్థానాల్లో సీ సెక్షన్‌ ఆపరేష న్లు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో ద్వితీయ స్థానంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తృతియస్థానంలో ఉన్నాయి.

 

 

 

తెలంగాణలో సీ సెక్షన్‌ ఆపరేషన్లు అధికంగా జరుగుతున్న జిల్లాల్లో కరీంనగర్‌ జిల్లా టాప్‌లో ఉంది. 300 పడకలు, ఆపై ఉన్న పెద్దస్థాయి ఆసుపత్రుల కేటగిరీలో దేశంలోనే అత్యధిక సీ సెక్షన్లు జరి గిన ఆసుపత్రుల్లో కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రి 69.93శాతం ఆపరేషన్లతో దేశంలోనే రెండోస్థానంలో నిలవ డం గమనార్హం. ఇక కేవలం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో జరిగే సిజేరి యన్లను పరిగణనలోనికి తీసుకుంటే అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ వరుస స్థానాల్లో ఉన్నాయి.ఈ ఆసుపత్రుల్లోనైనా సీ సెక్షన్‌ ఆపరేషన్లు 10శాతం దాటితే అవి తల్లి, బిడ్డ మరణాలు తగ్గించడం కోసం జరిగినవి కావని, కేవలం ధనార్జనే ధ్యేయంగా జరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేస్తోంది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం సీ సెక్షన్లు మొత్తం కాన్పుల్లో కేవలం 10శాతం, ఒక్కోసారి 15 శాతం వరకు మాత్రమే ఉండాలి.ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా  సీ సెక్షన్‌ ఆపరేషన్లు జరుగుతున్నాయని  నీతి ఆయోగ్‌ తాజా అధ్యయనం వెల్లడించింది. కరీంనగర్‌ జిల్లా లోని ప్రయివేటు ఆసుపత్రుల్లో ఇప్పటికీ  90శాతం సిజేరియన్లే జరుగుతున్నట్లు గుర్తించారు. నిజామాబాద్‌ జిల్లాలో 77శాతం, మం చిర్యాల, నిర్మల్ లోనూ  90 శాతం సిజేరియన్లే జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 62.36శాతం సీజేరియన్లు  ఈ  ఏడాదికి 79.14 శాతానికి  చేరుకున్నాయ‌ని  వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

 

Tags: Kits are the way kits are …. non-stop caesareans

Leave A Reply

Your email address will not be published.