వియ్యాలవారితో ఇక కయ్యాలే..

రాజమండ్రి  ముచ్చట్లు:
టీడీపీలో వియ్యంకులు అంటే చాలా మందే ఉన్నారు.. బాల‌య్య – చంద్రబాబు, గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యేలు జీవీ.ఆంజ‌నేయులు-కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌బాబు, ఆదిరెడ్డి, కింజార‌పు, బండారు ఫ్యామిలీలే కాదు.. మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కూడా వియ్యంకులే. పైన చెప్పుకున్న వియ్యంకులు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచి త‌మ ప్రాంతాల్లో చ‌క్రం తిప్పారు. అయితే పుట్టా, య‌న‌మ‌ల మాత్రం త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడి ప‌ట్టు కోల్పోయి.. నామినేటెడ్ ప‌ద‌వుల‌తో చ‌క్రం తిప్పారు. 2014లో పార్టీ గెలిచిన‌ప్పుడే కాకుండా.. 2019లో పార్టీ ఓడిన‌ప్పుడు కూడా ఈ ఇద్దరు వియ్యంకుల కుటుంబాలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో చిత్తుగా ఓడిపోయాయి.ఈ ఇద్దరు వియ్యంకుల్లో సీనియ‌ర్ అయిన య‌న‌మ‌ల ఫ్యామిలీ తునిలో 2004 త‌ర్వాత గెలుపు అన్న మాటే మ‌ర్చిపోయింది. మొత్తంగా మూడు సార్లు ఓడిన య‌న‌మ‌ల ఫ్యామిలీకి తునిలో ప‌ట్టే లేకుండా పోయింది. 2014 ఎన్నిక‌ల్లో య‌న‌మ‌ల ఫ్యామిలీ ( సోద‌రుడు కృష్ణుడు) ఓడినా టీడీపీ అధికారంలోకి రావ‌డంతో ఎమ్మెల్సీగా ఉన్న య‌న‌మ‌ల ఏకంగా ఆర్థిక‌మంత్రి అయిపోయారు. ఇక ఆయ‌న సోద‌రుడు ఓడినా ఏపీలో ఏ నియోజ‌క‌వ‌ర్గంలో లేని విధంగా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి ఏకంగా తుని ఏఎంసీ చైర్మన్ ప‌ద‌వి ఇప్పించుకున్నారు.

 

అంటే పార్టీ కేడ‌ర్‌ను వీరు ఏ మాత్రం గుర్తించ‌లేద‌న్నది అర్థమ‌వుతోంది.ఇక మైదుకూరులో పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. య‌న‌మ‌ల బాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తే ఆయ‌న‌కు ఏకంగా టీటీడీ చైర్మన్ ప‌ద‌వి క‌ట్టబెట్టారు. ఈ ప‌ద‌వి కోసం నాడు టీడీపీలో మ‌హామ‌హులు అయిన నాయ‌కులు పోటీలో ఉన్నా కూడా బాబు సుధాక‌ర్ యాద‌వ్‌కే ఇచ్చారు. ఎన్నిక‌లు అయ్యి జ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా సుధాక‌ర్ యాద‌వ్ ఈ ప‌ద‌విలోనే కొన‌సాగారు. పార్టీ గెలిచిన‌ప్పుడు కూడా ఓడిన ఈ వియ్యంకుల‌కు చంద్రబాబు మంచి మంచి ప‌ద‌వులు ఇచ్చినా కూడా వారు ప్రజ‌ల‌కు చేరువ కాలేక‌పోయారు. పార్టీ గెలిచిన‌ప్పుడు చిత్తుగా ఓడి.. పార్టీ ఓడిన‌ప్పుడు కూడా వీరు చిత్తుగానే ఓడిపోయారు.అలాంట‌ప్పుడు చంద్రబాబు వీరిని ఎందుకు నెత్తిన పెట్టుకుని మోస్తున్నార‌న్న విమ‌ర్శలు పార్టీ నేత‌ల్లోనే వ‌స్తున్నాయి. గుడ్డిలో మెల్ల ఏంటంటే ఇటీవ‌ల మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తునిలో టీడీపీ అడ్రస్ పూర్తిగా గ‌ల్లంతు కాగా.. మైదుకూరు రాష్ట్ర స్థాయిలోనే టీడీపీ గెల‌వాల్సిన రెండో మున్సిపాల్టీగా నిల‌వాల్సి ఉండేది. మైదుకూరులో 24 వార్డుల్లో టీడీపీ 12 గెలిచింది. అటు వైసీపీకి 11, జనసేనకు ఒక వార్డు వచ్చింది. అయితే ఎమ్మెల్యే, ఎంపీ ఓటుతో పాటు జ‌న‌సేన కౌన్సెల‌ర్‌తో చివ‌ర‌కు వైసీపీ మున్సిప‌ల్ పీఠం ద‌క్కించుకుంది. పుట్టాకు ఎక్కువ కౌన్సెల‌ర్ సీట్లు గెలుచుకున్నామ‌న్న ఆనందం కూడా లేకుండా పోయింది. ఏదేమైనా ఈ వియ్యంకుల‌కు వ‌చ్చే ఎన్నిక‌లే చివ‌రి ఛాన్స్ కానున్నాయి. ఇప్పటికే వీరిని ఓడినా ప‌ద‌వులు ఇస్తూ భ‌రిస్తూ వ‌స్తోన్న చంద్రబాబు వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత భ‌రిస్తే మొద‌టికే మోసం వ‌చ్చే ప్రమాదం ఉంది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ వియ్యంకులు త‌మ ప‌ట్టు నిలుపుకుంటారో ? లేదో ? చూడాలి.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Kiyale with Viyalavari ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *