మదనపల్లె మున్సిపల్‌ కమిషనర్‌గా కెఎల్‌.వర్మ

KL Varma is the Municipal Commissioner of Madanapalle

KL Varma is the Municipal Commissioner of Madanapalle

Date:13/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

మదనపల్లె మున్సిపాలిటి కమిషనర్‌గా పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మంగళవారం మున్సిపల్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కెఎల్‌.వర్మకు పుంగనూరుతో పాటు మదనపల్లె మున్సిపాలిటి కూడ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. గత బదిలీల్లో మదనపల్లె మున్సిపాలిటికి ఎవరిని కమిషనర్‌గా నియమించకుండ ఖాళీగా ఉంచారు. ప్రస్తుతం వర్మను నియమించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ మదనపల్లెలో కూడ అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో ఈ రెండు మున్సిపాలిటిల్లో నియంత్రించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మదనపల్లె మున్సిపాలిటికి చెందిన వివిధ శాఖల అధికారులు కమిషనర్‌ కెఎల్‌.వర్మను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

రేషన్‌బియ్యం గోడౌన్‌లో పురుగులు

Tags: KL Varma is the Municipal Commissioner of Madanapalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *