కమిషనర్‌గా కెఎల్‌.వర్మ పదవి స్వీకారం

KL Varma sworn in as commissioner

– పలువురు సన్మానం

Date:12/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు కమిషనర్‌గా కెఎల్‌.వర్మ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ ముస్లిం మైనార్టీ నాయకుడు అయూబ్‌ఖాన్‌ , కాపు సంఘ నాయకులు నానబాలగణే ష్‌, త్యాగరాజు, వ్యాపారులు సుబ్రమణ్యం, రెడ్డిప్రసాద్‌లు, పట్టణ ప్రముఖులు డాక్టర్‌ శివ, కెసిటివి అధినేత ముత్యాలు కలసి కమిషనర్‌కు శాలువలు కప్పి , పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపి పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిల సూచనల మేరకు తిరిగి పుంగనూరు కమిషనర్‌గా రావడం జరిగిందన్నారు. మంత్రి ఆదేశాల మేరకు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ఒకటోస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. పట్టణ ప్రజలు, మేధావివర్గం గతంలో లాగా మున్సిపాలిటి అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందించాలన్నారు. పట్టణంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధిస్తామన్నారు. అలాగే పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాకు తొలి ప్రధాన్యత కల్పించి, సమస్యలు లేకుండ చూస్తామన్నారు. ఈ సందర్భంగా అలాగే మాజీ కౌన్సిలర్లు దివ్యలక్ష్మి, అమ్ము , వేలువెహోదలి,ఆసిఫ్‌, పట్టణ పార్టీఅధ్యక్షుడు ఇఫ్తికార్‌ కమిషనర్‌ను కలిసి స్వాగతం పలికారు. అలాగే మున్సిపల్‌ అధికారులు అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, టీపీవో క్రిష్ణారావు, డీఈఈ ప్రసాద్‌, ఏఈ క్రిష్ణకుమార్‌ తదితర శాఖల అధికారులు, సిబ్బంది కమిషనర్‌కు మర్యాదపూర్వకంగా కలిశారు.

మనవతతో 155 మంది రక్తదానం

Tags: KL Varma sworn in as commissioner

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *