చట్టం గురించి తెలుసు కో-నీ హక్కులు కాపాడు కో
-ఆక్ట్ మీడియా తెలుగు
-చీటింగ్ (వంచన/మోసం) చీటింగ్కిశిక్ష
అమరావతి ముచ్చట్లు:

ఇండియన్ పీనల్ కోడ్ IPC 415 చీటింగ్ గురించి 417, 419, 420 చీటింగ్ కి శిక్ష గురించి తెలియజేస్తుంది.IPC 415 – ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దురుద్ధేశ్యపూర్వకంగా వంచించి, వంచింపబడిన వ్యక్తి మరొక వ్యక్తికి ఏదైనా ఆస్థిని ఇచ్చివేయునట్లుగా ప్రేరేపించినట్లయితే అది వంచన లేదా మోసం అవుతుంది. అదేవిధంగా వంచనకు గురైన వ్యక్తి ఆ వంచన ప్రభావంతో ఏదైనా ఆస్థి మరొక వ్యక్తి వద్దనే ఉంచేటందుకు అంగీకరించినా అది వంచన అవుతుంది. అదేవిధంగా సాధారణ పరిస్థితుల్లో ఒక వ్యక్తి చేయదగిన పనిని వంచన ప్రభావంతో చేయకుండా ఉండేటట్లుగా ప్రేరేపించినా లేక చేయదగని పనిని వంచన ప్రభావంతో చేసేలా ప్రేరేపించినా అది వంచన అవుతుంది. అటువంటి చర్యల వలన వంచనకు గురైన వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలకు గానీ లేదా ఆస్థికి గానీ నష్టం లేదా ప్రమాదం జరిగి ఉండాలి. లేదా మానసిక లేదా శారీరక హాని లేదా ప్రమాదం జరిగి ఉండాలి లేదా మానసిక లేదా శారీరక హాని లేదా ప్రమాదం జరిగి ఉండాలి లేదా నష్టం జరుగుటకు అవకాశం కలిగి ఉండాలి. ఆ విధంగా ఒక వ్యక్తిని చీటింగ్ చేసిన వ్యక్తిని చీటర్ అనవచ్చు.
వివరణ : దుర్భుద్దితో కొన్ని వాస్తవాలను దాచి ఉంచడం కూడా ఈ సెక్షన్ పరిధిలో చీటింగ్ అవుతుంది…✍️IPC 417 – చీటింగ్ ( వంచన ) కి పాల్పడిన వంచకులకు 1 సంవత్సరం జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.IPC 419 – ఒక వ్యక్తి మరొక వ్యక్తిలా నటిస్తూ బుద్ధి పూర్వకంగా మోసం చేస్తే 3 సంవత్సరాల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.IPC 420 – ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చీటింగ్ చేస్తే తద్వారా ఆ చీటింగ్ కి గురైన వ్యక్తి యొక్క ఏదైనా ఆస్థి బదలాయింపు చేసేలా చేసినా లేదా చేసినట్లు సృష్టించినా లేదా ధ్వంసం చేసినా ఆ చీటింగ్ చేసిన వ్యక్తికి 7 సంవత్సరాల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు… IPC 420 అనేది కాగ్నిజబుల్ మరియు నాన్-బెయిలబుల్ నేరాన్ని తెలియజేస్తుంది…రచన.ఎస్.ఆర్.ఆంజనేయులుసేకరణ:ఉత్తరాది హరిప్రసాద్చైర్మన్&చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ఆక్ట్ మీడియా తెలుగు.
Tags:Know the law and protect your rights
