Natyam ad

క్యాన్సర్ ఉందని తెలుసు, అమ్మ నాన్నకు చెప్పకండి” –

హైదరాబాద్‌ ముచ్చట్లు:


క్యాన్సర్‌ మహమ్మారికి బలి అయిన ఓ ఆరేళ్ల చిన్నారి కథను చెబుతూ ఓ డాక్టర్ చేసిన ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి.ఆరేళ్ల పిల్లాడికి ఏం తెలుస్తుంది. తోటి పిల్లలతో ఆడుకుంటాడు. అల్లరి చేస్తాడు. అమ్మ నాన్నలను విసిగిస్తాడు. ఇంతకు మించి ఏం చేయగలడు అని అనుకుంటాం. కానీ…వయసుకి, ఆలోచనలకు సంబంధం లేదని నిరూపించాడు హైదరాబాద్‌కు చెందిన ఓ చిన్నారి. “నేను ఎక్కువ కాలం బతకను. ఈ విషయం అమ్మ నాన్నకు చెప్పకండి. బాధ పడతారు” అని ఓ వైద్యుడికి చెప్పాడు. ఇది విన్న ఆ వైద్యుడి నోట మాట రాలేదు. “ఆరేళ్ల  పిల్లాడేనా ఇలా మాట్లాడేది” అని ఆశ్చర్యపోయాడు. ఆ చిన్నారికి క్యాన్సర్ వచ్చింది. ఇదే విషయాన్ని ఆ డాక్టర్‌తో చెప్పాడు. “నేను ఆరు నెలల కన్నా ఎక్కువ బతకను. నాకున్న లక్షణాలను బట్టి ఇది క్యాన్సర్ అని గూగుల్‌లో వెతికి తెలుసుకున్నా. ఈ విషయం అమ్మనాన్నలకు తెలియదు. మీరూ చెప్పకండి. నా చివరి రోజుల్లో వాళ్లు ఆనందంగా చూడాలని కోరుకుంటున్నా” అని ఆ వైద్యుడికి చెప్పాడు ఆ ఆరేళ్ల చిన్నారి. క్యాన్సర్ మహమ్మారి ఆ బాలుడిని బలి తీసుకున్నాక కానీ…ఆ వైద్యుడు ఎవరికీ చెప్పలేదు. ఆ చిన్నారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోడం కోసం ఆ బాధను అలా గుండెల్లోనే దాచుకున్నాడు. ఆ చిన్నారి మరణించాక…ట్విటర్‌లో ఈ కన్నీటి కథను పోస్ట్ చేశారు. వరుస ట్వీట్‌లతో అసలు విషయం అంతా చెప్పారు. ఆయనె చెప్పిన వివరాల ప్రకారం…హైదరాబాద్‌కు చెందిన దంపతులకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు.

 

 

 

వయసు ఆరేళ్లు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లి టెస్ట్‌లు చేయించారు. అప్పుడే ఆ బాబుకి క్యాన్సర్‌ ఉందని తేలింది. ఇది విని తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. ఏం జబ్బు వచ్చిందో ఆ చిన్నారికి తెలయనీయకుండా జాగ్రత్తపడ్డారు. మందులు వాడారు. కానీ…ఆ చిన్నారి మాత్రం తనకు ఇస్తున్న మెడిసిన్ ఏంటో గూగుల్‌లో వెతికాడు. తనకు క్యాన్సర్ ఉందని అర్థం చేసుకున్నాడు. ఆ తరవాత తరచూ ఫిట్స్ వస్తుండటం వల్ల హైదరాబాద్‌లోని న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్‌బాబు వద్దకు తీసుకెళ్లారు. విషయంతా చెప్పారు. చిన్నారికి బ్రెయిన్ క్యాన్సర్ ఉందని వైద్యుడు తెలిపాడు.  అప్పుడే ఉన్నట్టుండి ఆ చిన్నారి తల్లిదండ్రులను బయటకు వెళ్లమని చెప్పాడు. డాక్టర్‌తో పర్సనల్‌గా మాట్లాడాడు. “డాక్టర్..నాకు క్యాన్సర్ వచ్చింది కదా. నేను గూగుల్‌లో చూసి తెలుసుకున్నాను. ఈ వ్యాధి వచ్చిన వాళ్లు ఎక్కువ రోజులు బతకరు అని తెలుసు. నాకు తెలుసన్న విషయం అమ్మనాన్నలకు తెలియదు. మీరూ  ఈ విషయం వాళ్లకు చెప్పొద్దు” అని వేడుకున్నాడు. ఆ తరవాత ఆ వైద్యుడు చిన్నారి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడాడు.

 

 

 

Post Midle

“క్యాన్సర్ వచ్చిందని మీ బాబుకి తెలుసు. ఈ చివరి రోజుల్లో తను హ్యాపీగా ఉండాలంటే…మీకు ఈ విషయం తెలియనట్టే ఉండండి” అని సూచించాడు. ఇది విని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు ఆ తల్లిదండ్రులు. చిన్నారి గొప్ప మనసుని అర్థం చేసుకుని ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నించారు. రకరకలా వంటకాలు చేసి పెట్టారు. ప్రదేశాలు తిప్పారు. అమెరికాకు తీసుకెళ్లి తనకు ఇష్టమైన ప్రతి చోటుకీ తీసుకెళ్లారు. “ఈ ఆనందం అంతా తాత్కాలికమే” అని తెలిసినా ఆ బాధను దిగమింగుకుని కాలం గడిపారు. 8 నెలలు గడిచాక…ఆ చిన్నారి ఈ లోకం వదిలి వెళ్లిపోయాడు. ఆ తరవాత  ఆ తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్‌ సుధీర్‌బాబుని కలిసి విషయం చెప్పారు. ఇది విని ఎమోషనల్ అయిన డాక్టర్ భావోద్వేగాన్ని ఆపుకోలేక ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది చదివిన నెటిజన్లు “ఇంత చిన్న వాడికి ఎంత గొప్ప ఆలోచన” అని కామెంట్ చేస్తున్నారు.

 

Tags: Know you have cancer, don’t tell Mom and Dad” –

Post Midle