కొడాలి నాని కంటిన్యూ….

విజయవాడ  ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. అయితే ఏ మంత్రి కేబినెట్ లో ఉంటారు? ఎవరు వెళతారు? అన్న చర్చ వైసీపీలో జోరుగా సాగుతుంది. ఈ పరిస్థితుల్లో కొందరు మంత్రులు మాత్రం కొనసాగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఎన్నికల కేబినెట్ కావడం, వారి అవసరం పార్టీకి ఉండటంతో కొందరిని తప్పనిసరిగా కొనసాగిస్తారన్నది వాస్తవం. జగన్ కు కూడా అది అవసరమే. కొనసాగే మంత్రుల్లో కొడాలి నాని ముందువరసలో ఉన్నారంటున్నారు.కొడాలి నాని కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. పార్టీ వాయిస్ ను బలంగా విన్పించే నేత. ఈ రెండేళ్ల కాలంలో మిగిలిన మంత్రులతో పోల్చుకుంటే కొడాలి నాని ప్రత్యర్థి పార్టీలపై చేసిన విమర్శలు ఆయన పదవిని కాపాడేలా ఉన్నాయి. కొడాలి నాని భాష అభ్యంతరం కావచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. అయితే విషయాన్ని ప్రజల్లోకి సూటిగా తీసుకెళ్లగలిగేది కొడాలి నాని మాత్రమేనన్నది వైసీపీ క్యాడర్ లో బలంగా ముద్రపడిపోయింది.ప్రధానంగా చంద్రబాబు, లోకేష్, మీడియా అధిపతులపై విమర్శలు కొడాలి నాని చేసినంత ఘాటుగా మరెవ్వరూ చేయలేరు. జనాల్లోకి ఇది బాగా వెళుతుందన్నది వాస్తవం. కొడాలి నాని విమర్శలకు అవతలి వైపు నుంచి కౌంటర్లు కూడా ఈ రెండేళ్లలో పెద్దగా కన్పించలేదు. దీంతో కొడాలి నాని జగన్ కు మరింత దగ్గరయ్యారన్నది వైసీపీలో ప్రస్తుతం విన్పిస్తున్న టాక్. జగన్ స్వయంగా కొడాలి నాని చేత ప్రెస్ మీట్ పెట్టించమని చెబుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు.ఇక కొడాలి నానిని కొనసాగించేందుకు మరో బలమైన కారణం కూడా ఉంది. కమ్మ సామాజికవర్గం నుంచి గెలిచిన వారిలో ఎవరూ పార్టీలో అంత సీనియర్ లేరు. అంత గట్టిగా మాట్లాడే వారు కూడా లేరు. కేబినెట్ లో కమ్మ సామాజిక వర్గానికి ఖచ్చితంగా చోటు ఇవ్వాలి. జగన్ కు కొడాలి నాని తప్ప మరో ఆప్షన్ లేదు అన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా కొడాలి నాని సీటు మాత్రం పదిలమే.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Kodali Nani Continue ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *