4న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుపతి ముచ్చట్లు:

 

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జూలై 4వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై 10 నుండి 12వ తేదీ వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఉత్స‌వానికి ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6. 30 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. మ‌ధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు :

జూలై 4వ తేదీన తిరుప్పావడసేవ, ఆర్జిత కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.

 

Tags: Koil Alwar Thirumanjanam at Sri Kalyana Venkateswara Swamy Temple on 4th

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *