Natyam ad

ఫిబ్రవరి 25న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయంలో మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.   ఇందులో భాగంగా ఫిబ్రవరి 25న ఉద‌యం 11.30 నుంచి మ‌ధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారు. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.

 

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

 

Post Midle

తేదీ 01-03-2024

ఉద‌యం – ధ్వజారోహణం

రాత్రి – హంస వాహనం :02-03-2024

ఉద‌యం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం :03-03-2024

ఉద‌యం – భూత వాహనం

రాత్రి – సింహ వాహనం:04-03-2024

ఉద‌యం – మకర వాహనం

రాత్రి –  శేష వాహనం:05-03-2024

ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం

రాత్రి – అధికారనంది వాహనం:06-03-2024

ఉద‌యం – వ్యాఘ్ర వాహనం

రాత్రి – గజ వాహనం:07-03-2024

 

ఉద‌యం – కల్పవృక్ష వాహనం

రాత్రి – అశ్వ వాహనం08-03-2024

ఉద‌యం – రథోత్సవం (భోగితేరు)

రాత్రి – నందివాహనం09-03-2024

ఉద‌యం – పురుషామృగవాహనం

సాయంత్రం – కల్యాణోత్సవం,

రాత్రి – తిరుచ్చి ఉత్సవం10-03-2024

ఉద‌యం – త్రిశూలస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం,

రాత్రి – రావణాసుర వాహనం

 

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

 

Tags:Koil Alwar Thirumanjanam at Sri Kapileswara Swamy temple on 25th February

Post Midle