శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. కోవిడ్ – 19 నిబంధనల మేరకు ఫిబ్రవరి 22 నుండి మార్చి 3 వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయి.ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  సుబ్రమణ్యం, ఏఈవో  స‌త్రేనాయ‌క్, సూపరింటెండెంట్‌  భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  శ్రీ‌నివాస నాయ‌క్‌,  రెడ్డి శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
ఫిబ్రవరి 21న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల‌కు ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అంకురార్పణ జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
22-02-2022 ధ్వజారోహణం(మీన‌లగ్నం) హంస వాహనం
23-02-2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
24-02-2022 భూత వాహనం సింహ వాహనం
25-02-2022 మకర వాహనం శేష వాహనం
26-02-2022 తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
27-02-2022 వ్యాఘ్ర వాహనం గజ వాహనం
28-02-2022 కల్పవృక్ష వాహనం అశ్వవాహనం
01-03-2022 రథోత్సవం(భోగితేరు) నందివాహనం
02-03-2022 పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
03-03-2022 శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,
సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం. ధ్వజావరోహణం.
ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.
Tags; Koil Alwar Thirumanjanam at Sri Kapileswaraswamy Temple

Natyam ad