శ్రీ వకుళ మాత ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద ( పేరూరు బండపై) టీటీడీ నిర్మించిన శ్రీ వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్షణ చేశారు.అంతకుముందు ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు పుణ్యాహవచనం, రత్నాధివాసం, విమాన గోపుర కలశ స్థాపన, రత్నన్యాసం, ధాతు న్యాసం, విగ్రహ స్థాపన, అష్టబంధనం, యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు మహాశాంతి అభిషేకం, రాత్రి 8 నుండి 10.30 గంటల వరకు అగ్నిప్రణయనం, కుంభారాధన, శయనాధివాసం, సర్వదేవతార్చన, విశేష హోమాలు, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.అనంతరం జూన్ 23వ తేదీన ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా జరుగుతున్నఏర్పాట్లను ఈవో ఎవి.ధర్మారెడ్డి టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించి, పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పార్లమొంటు సభ్యులుమిథున్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు పోకల ఆశోక్ కుమార్, రాములు, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివి ఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబిసి సిఇవో సురేష్ కుమార్, సిఇ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవో గుణభూషణ్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: Koil Alwar Thirumanjanam scientifically at Sri Vakula Mata Temple
