శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ వైభవంగా జరిగిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
తిరుపతి ముచ్చట్లు:
అలిపిరి శ్రీవారి పాదాల మండపంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారికి తిరుపతికి చెందిన భక్తుడు టి వి మనోహర్ కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలను సమర్పించారు.
గత 23 సంవత్సరాలుగా స్థానిక సరోజినీ దేవి రోడ్డు కు చెందిన శ్రీవారి భక్తుడు మనోహర్,ఆయన కుటుంబ సభ్యులు వైకుంఠ ఏకాదశి, ఉగాది పర్వదినాలను పురస్కరించుకొని శ్రీవారికి, భోగ శ్రీనివాసమూర్తి,
శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారికి, శ్రీగోదాదేవి అమ్మవారికి, పెరియాల్ వారికి, శ్రీ ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ అనంతరం ఈ పట్టు వస్త్రాలను టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఏ ఈ ఓ రవి కుమార్ రెడ్డి లకు అందించారు.ఈ కార్యక్రమంలో పాదాల మండపం అర్చక స్వాములు శ్రీనివాస మూర్తి సుధా స్వామి, బందరు శ్రీనివాసులు, బద్రీనాథ్, పరిచారిక భరద్వాజ్, ఇన్స్పెక్టర్ దేవేంద్ర, షరాబు సుధాకర్, ఆర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా జరిగిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ..
రానున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే అలిపిరి శ్రీవారి పాదాల మండపం, శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాలతో పాటు ఉప ఆలయాల్లో స్థానిక డిప్యూటీ ఈవో రాజేంద్రుడు ఆధ్వర్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం అర్చక స్వాములు ఆలయ గర్భాలయంలో ప్రత్యేక లేపనం ద్వారా గోడలను శుద్ధి చేశారు.. పసుపు కుంకుమ నామం పచ్చ కర్పూరం పన్నీరు చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో లేపనం తయారుచేసి అన్ని ఆలయాల్లోని గర్భాలయ గోడలకు లేపనం చేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ ఈవో రాజేంద్రుడు మాట్లాడుతూ గురువారం వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటల నుంచే ప్రత్యేక వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేశామని తెలిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Koil Alwar Thirumanjanam was held in honor of the offering of silks to Srivastava.