Natyam ad

అమృత్ కలశ యాత్ర  నేతలను ఘనంగా సన్మానించిన కోలా ఆనంద్ కుమార్

– ఢిల్లీ కలశల యాత్రను విజయవంతం చేసిన శ్రీకాళహస్తి బీజేపీ నాయకులు

 

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

Post Midle

భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నా మట్టి – నా దేశం కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గం  నందు కోలా ఆనంద్ కుమార్ గారి నేతృత్వంలో ఘనంగా నిర్వహించి, తదుపరి ఢిల్లీ కలశల యాత్రను  విజయవంతంగా పూర్తి చేసుకొని శ్రీకాళహస్తికి తిరిగి వచ్చిన బీజేపీ నేతలను 05. 11. 2023 తేదీ ఆదివారం ఉదయం 11.00 గం.లకు రాష్ట్ర బీజేపీ సెక్రటరీ, నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్ వారి స్వగృహం నందు ఢిల్లీ యాత్ర నేతలను ఘనంగా సన్మానించారు. దేవస్థాన శేషవస్త్రాలు, పూలమాలతో కోట వెంకటేష్, ఇమ్మిడిశెట్టి మోహన్, పల్లం చెంగల్రాయులు, కేతినేని బాలాజీ నాయుడు, తిరువిధుల రాజానరసింహులు, తోటి గోపిలను ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా శ్రీకోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ మేర మాటి – మేర దేశ్ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  స్పెషల్ రైలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతి మండలం నుంచి పవిత్ర కలశలతో ఢిల్లీకి చేరుకున్నారు. అదేవిధంగా దేశ నలుమూలల నుంచి వచ్చిన కలశల మట్టితో అమృత్ ఉద్యానవన వాటికలో దేశం  కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుల స్మారక స్తూప నిర్మాణంలో దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ  నేతృత్వంలో  ఉపయోగించడం జరుగుతుందని ఈ సందర్భంగా కోలా ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ, నియోజకవర్గ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్, కో – కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శిలు మద్దు వాసు యాదవ్, కందాటి మునిరాజ, ఓబీసీమోర్ఛా పట్టణ అధ్యక్షులు కన్నా వెంకటేశ్వర్లు, సజ్జ హరి మరియు సన్మాన గ్రహీతలు పాల్గొన్నారు.

 

Tags: Kola Anand Kumar honored the leaders of Amrit Kalash Yatra

Post Midle