శాససనభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన కోలగట్ల వీరభద్రస్వామి.

-డిప్యూటీ స్పీకర్‌ ను అభినందించిన సీఎం జగన్‌.

 

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం నాడు బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ డిప్యూటీ స్పీకర్ ను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ‘డిప్యూటీ స్పీకర్ గా మీరు ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది. మిమ్నల్ని ఎప్పుడూ నేను ఆప్యాయంగా స్వామి అన్న అని పిలుస్తూ ఉంటాను. అలాంటి మిమ్నల్ని ఈ రోజు ఈ స్ధానంలో కూర్చోబెట్టడం చాలా సంతోషంగా ఉంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా మీరు ఈ చట్టసభల్లో సేవాలందించారు. మొట్టమొదటిసారిగా 2004లో తొలిసారిగా శాసనసభకు ఎన్నిక కావడం, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆ పదవి నుంచి వైదొలిగి, రాజీనామా చేసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఆ తరువాత 2019 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మీరు డిప్యూటీ స్పీకర్‌ స్థానంలో కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీ కన్నా ముందు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కోన రఘుపతి చేసిన మంచి కూడా సభ ద్వారా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మూడు సంవత్సరాల పాటు కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. మరో సామాజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్ స్థానం ఇవ్వాలని తనతో చర్చించినపుడు, తాను కూడా మనస్ఫూర్తిగా దీన్ని మంచి నిర్ణయం అన్నారు. మన పార్టీలో వీలైనంత ఎక్కువ మందికి ప్రాధాన్యతనిచ్చేలా చూస్తున్నాం. పార్టీ నిర్ణయం చాలా మంచిదనే మాట చెబుతూ ఎటువంటి బాధ లేకుండా చిరునవ్వుతోనే స్వాగతించారు.మీరు డిప్యూటీ స్పీకర్‌గా ఈ చట్టసభలో అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’.

 

Tags:Kolagatla Weerabhadraswamy took charge as the Deputy Speaker of the Legislative Assembly.

Leave A Reply

Your email address will not be published.