బంట్రోతులను మించిపోతున్న అధికారులు-కొల్లు రవీంద్ర
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్ర అధికారులు బంట్రోతులను మించిపోతున్నారు. కోర్టులు చివాట్లు పెడుతున్న సిగ్గువిడిచి జగన్ కు ఊడిగం చేస్తున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. సాక్షాత్తు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక మర్డర్ కేసు లో సీబీఐ విచారిస్తున్న వ్యక్తి కోసం సీబీఐ విచారణ ఆఫీస్ ముందు వెయిట్ చేసి అతన్ని పికప్ చేసుకున్నాడని ప్రజలు వుమ్మివెస్తున్నరు. అసలు ఈ రాష్ట్రాన్ని ఎం చేద్దామని అనుకుంటున్నారు అర్థం కావడం లేదు. బంట్రోతులను మించి పోయి ఐఏఎస్ లు ఊడిగం చేస్తున్నారు.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. వివేకా హత్య కేసు విషయంలో తాడేపల్లి కొంపలో సీబీఐ టెన్షన్ మొదలైంది. నిన్న జగన్, భారతిల సహాయకులు కృష్ణమోహన్ రెడ్డి, నవీన్లను ప్రశ్నించిన సీబీఐ – సీబీఐ తరువాతి టార్గెట్ ఎవరన్నదానిపై తాడేపల్లి లో ఆందోళన మొదలైందని అన్నారు.
సీబీఐ విసయాన్ని పక్కదారి పట్టించేందుకు యువనేత నారా లోకేష్ పాదయాత్ర ప్రచార వాహనాలను సీజ్ చేయటం. ఏ రాజ్యాంగం, ఏ చట్టం ప్రకారం పోలీసులు సీజ్ చేసారో సమాధానం చెప్పాలి. అధికార మదంతో వాహనాలను మాత్రమే సీజ్ చేయించగలవు జగన్ రెడ్డి.. యువగళమై లోకేష్ రి వెంట వచ్చే అశేష జనవాహినిని మాత్రం ఆపలేవు.
యువగళం పాదయాత్రపై వైసీపీ ప్రభుత్వం కుట్రల జోరు పెంచుతోంది. పోలీసులను ఉపయోగించుకుని నారా లోకేష్ గారిని ప్రజలతో మాట్లాడనీయకుండా చేస్తోంది. పాదయాత్ర బంగారుపాళ్యం చేరుకోగా నారా లోకేష్ ని ప్రచార వాహనం పై నుంచి ప్రసంగించకుండా పోలీసులు అడ్డుకున్నారు దీన్ని ఇంతటి వదలం. ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే నమ్మకం లేకపోవడం. నమ్మకం లేకపోవడానికి కారణం భయం. ఈ తాడేపల్లి పిల్లికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు అన్నా భయమే. సొంత చెల్లెలు, తల్లి అన్నా భయమే. ప్రజల్లోకి వెళ్లాలన్నా భయమే. ఇలాంటి మానసిక సమస్య ఉన్న వ్యక్తి నీ ప్రజలు తరిమి తరిమి కొట్టాలని అన్నారు.

Tags: Kollu Ravindra, the officers who are outdoing the bandits
