అమిత్ షా తో కోమటి బ్రదర్స్ భేటీ
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కోమటిరెడ్డి బ్రదర్స్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఒకే రోజు కలవడం ఆసక్తిగా మారింది. వారిద్దరూ విడివిడిగా అమిత్‌షాను కలుస్తారు. పార్టీలో చేరికపై ముహూర్తం ఫైనల్ చేసేందుకు రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షాను కలిసి చర్చిస్తారు. మరోవైపు వరదలపై సాయం కోసం అమిత్‌షాను కలుస్తానని, రాష్ట్రంలో వరద పరిస్థితిని వివరిస్తానని చెబుతున్నారు వెంకట్‌రెడ్డి. వారిద్దరూ ఒకే రోజు హోంమంత్రిని కలవనుండటం ఆసక్తిగా మారింది. కేవలం వరదల అంశంపైనే కలుస్తున్నానని, వేరే రకంగా ప్రచారం చేయొద్దని వ్యాఖ్యానించారు వెంకట్‌రెడ్డి.తెలంగాణ రాష్ట్రమంతా మునుగోడు వైపే చూస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని అలెర్ట్‌గా ఉంటోంది. ఇప్పటికే ఎంత కాకరేగాలో అంతా రేగింది. ఇప్పుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంతో..అప్పటి వరకు..అతి బలవంతంగా నిగ్రహాన్ని ఆపుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక బరస్ట్ అయిపోయారు. తనని ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ రెడ్డిని ఎలా చేర్చుకుంటారని ఆగ్రహించారు.
రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడనని తెగేసి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటన వెంటనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఒకవైపు సొంత తమ్ముడు.. మరో వైపు మూడు దశాబ్ధాలకు పైగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం..ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్న వెంకటరెడ్డిని తాజా పరిణామాలు మరింత బాధిస్తున్నాయి. తమ్ముడితో వెళ్తారా..పార్టీలోనే ఉంటారా అన్నది అనుచరులకే అంతుచిక్కడం లేదు.మొత్తానికి మునుగోడు ఎపిసోడ్ సెకన్ సెకన్‌కు పొలిటికల్ హీట్ పెంచుతోంది. చెరుకు సుధాకర్‌నే మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించితే మాత్రం.. ఉప ఎన్నిక అత్యంత రసవత్తరంగా ఉంటుంది.
Tags: Komati Brothers meeting with Amit Shah