Komatireddy protest in Melbourne

మెల్బోర్న్ లో కొమటిరెడ్డి నిరసన

Date:14/12/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డివెంకటరెడ్డి ఆస్ట్రేలియ పర్యటనలో వున్నారు.  మెల్బోర్న్ నగరంలోని ఫెడరేషన్ స్క్వేర్ వద్ద నిరసనకు దిగారు.  నిరసనను అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సాండెపోగు సంపత్ కుమార్ కుమారుడు దీపక్ ప్రాగ్నా నిర్వహించారు.కొమటిరెడ్డి మాట్లాడుతూ  అన్యాయమైన పౌరసత్వ సవరణ బిల్లు పై ఈ నిరసన నిర్వహించబడింది మరియు భారతదేశం మరియు తెలంగాణలో పెరుగుతున్న నిరుద్యోగం, మహిళల భద్రత మరియు రైతు మరణాలు వంటి ఇతర సమస్యలకు నిరసన నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టె బిల్లుల చర్యలను మెల్బోర్న్ నుండి విద్యార్థులు,  ఎన్ఆర్ఐ పౌరులు తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. కేంద్రంలో ,రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకరవడానికి ఎన్ ఆర్ ఐ లు కృషి చేయాలి. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎన్ ఆర్ ఐ లు ఎండగట్టాలని అన్నారు. తెలంగాణ లో ఎవరు కూడా సంతోషంగా లేరు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదని అన్నారు. రైతులను ఆదుకోవడంలో,ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కేసీఆర్ విఫలం చెందారు. ఉన్న ప్రభుత్వ స్కూల్ ను కేసీఆర్ మూసివేస్తున్నారని అయన ఆరోపించారు.

 

కదిరిలో చిన్నారి పై అత్యాచారయత్నం

 

Tags:Komatireddy protest in Melbourne

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *