మూటకొండూరులో కోమటిరెడ్డి పర్యటన

 Date:23/04/2019
యాదాద్రి  ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లాలో  మూటకొండూరు లో కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి  వడగళ్ల వర్షానికి  నష్టపోయిన వరి పంట ను పరిశీలించారు. రైతులుకు పంట నష్టం జరిగి రోజులు గడుస్తున్నా ఏ ఒక్క అధికారి కూడా  రాలేదు అప్పులు చేసి అద్దె బోర్లు తో వ్యవసాయ సాగు చేసి చేతి కొచ్చిన పంట అకాల వర్షాల వల్ల పంట మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది అని రైతులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు కన్నీరుమున్నీరయ్యారు వెంటనే కోమటిరెడ్డి యాదాద్రి జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్తో  ఫోన్ లో  సమస్య ను తెలియజేశారు. అసలు రైతుల పై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు అని ప్రభుత్వం పై మండి పడ్డారు.
Tags:Komatiredi tour in Mudikonduram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *