Natyam ad

కొండ చిలువ హల్చల్..

శ్రీసత్యసాయి ముచ్చట్లు:


శ్రీ సత్య సాయి జిల్లా బుక్క పట్నం మండలం లో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. జనాలు  ఆందోళనలతో పరుగులు తీసారు.  శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండలం మారాల లో ఓ మామిడి తోటలోకి వచ్చిన భారీ కొండచిలువ జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. మామిడి తోటలో పని చేసేందుకు వచ్చిన కూలీలు పెద్ద పెద్దగా అరుస్తూ పారిపోయారు. నెమ్మదిగా కదులుతున్న పామును చూసి హడలిపోయారు. సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల పొలాల రైతు లు విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో స్నేక్ క్యాచర్ మూర్తి మామిడి తోట వద్దకు వచ్చి గంటపాటు శ్రమించి భారీ కొండచిలువను బంధించి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మునుపెన్నడూ ఇంతటి భారీ కొండచిలువను తాము చూడలేదని జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

Tags; Konda Chiluwa Halchal..

Post Midle
Post Midle