కోల అన్నారెడ్డిని పరమార్శించిన కొండ దేవయ్య
కరీంనగర్ ముచ్చట్లు:
కుమారుడి మరణం జీవితంలో ఎప్పటికి తీరని లోటు అయినప్పటికి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ సమాజసేవలో తిరిగి బాగస్వాములు కావాలని రాష్ట్ర మున్నూరుకాపు సంంఘం అధ్యక్షులు, వేములవాడ మున్నూరుకాపు నిత్యాన్నసత్రం అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్, మున్నూరుకాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మన్ పటేల్ , వివిధ సేవ సంస్ధల బాధ్యులు ఇంజనీర్ కోల అన్నారెడ్డికి సూచించారు. కర్ణాటకలో ఇటివల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆయన కుమారుడు ఆదిత్య కుటుంబ సభ్యులను బుధవారం టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చల్లా హరిశంకర్లతో కలిసి పరామర్శించారు. కరీంనగర్లోని శ్రీపురం కాలనీలోని అన్నారెడ్డి ఇంట్లో ఆదిత్య చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. కుమారుడి మృతికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమారుడి పేరున సేవ కార్యక్రమాలు నిర్వహిస్తు తద్వారా అతడి ఆత్మకు శాంతి చేకూర్చాలని చేప్పుతూ అన్నారెడ్డిని, ఆయన కుటుంబసభ్యులను ఓదార్చరు. కుటుంబ సభ్యులకు ఫ్రగాడ సానుభూతి తెలిపారు.
Tags: Konda Devaiya who blessed Kola Anna Reddy