కొండబాబుకు ఆ స్థాయి లేదు

రాజమహేంద్రవరం      ముచ్చట్లు :
మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు ఆదిరెడ్డి వాసుని విమర్శించే స్థాయి బర్రె కొండబాబుకు  లేదని టీడీపీ మాజీ ఫ్లోర్ లీదర్ రాచపల్లి ప్రసాద్ సూచించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ పూజీ చైర్మన్ బర్రే కొండబాబుపై ఆయన ఫైర్ అయ్యారు. ఆదిరెడ్డి వారిపై అవాకులు చెవాకులు పేలితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. అడ్డదారుల్లో పదవులు పొందాల్సిన అవసరం లేదని, రాజకీయ లబ్ధి ఉనికి కాపాడుకునేందుకు పార్టీలు మారే నాయకుడు నువ్వెనన్న విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. క్వారీ ఏరియాలో పట్టాలు ఇవ్వడానికి ఎవరెవరి వద్ద ఎంత దండుకున్నానో అందరికి తెలిసిందేనని పేర్కొన్నారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆదిరెడ్డి పార్టీ మరి మళ్లీ సొంత గూటికి వచ్చారే తప్ప నీలా పార్టీలు మారి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు పట్టా ఇచ్చిన తరువాత తనకు ఆదిరెడ్డి వాసు పట్టా ఇప్పించారనే కృతజ్ఞతతో టీడీపీ కార్యాలయానికి వచ్చి ఆయన చేతులమీదుగా తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ముఖ్య నాయకులపై విమర్శలు చేసి వైసిపి నాయకుల మెప్పు పొందాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏ ఎంపీ ద్వారా వైసిపిలోకి వచ్చారో ఇప్పుడు కొండబాబు వ్యవహార శైలి తెలిసి వచ్చిన పెట్టారని ముందు ఆయన ఇంట్లో వ్యవహారాలు చక్కపెట్టుకుని ఆ తరువాత బయటి వ్యవహారాలపై దృష్టిసారిస్తే మంచిదన్నారు. క్వారీ ఏరియాలో 140 పట్టాలు అన్యాకాంతం చేసిన చరిత్ర కొండబాబుదని ఆరోపించారు.

ఆదిరెడ్డి కుటుంబానికి ఒక బ్రాండ్ ఉందని కరోనా సమయంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి నిరంతరం ప్రజలకు అండగా ఉన్న ఘనత వారికే దక్కుతుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో వదవి పొంది తరువాత బిఎస్పీ పార్టీలో తిరుగుతూ రాష్ట్ర నాయకుడిలా కటింగ్ ఇచ్చి అందరి దగ్గర డబ్బులు దున్ముకున్న చరిత్ర కొండబాబుదన్నారు. అతనొక పెద్ద అవినీతి పరుడని, కాటవరం ఇసుక ర్యాంవు దగ్గరకు వెళ్లి ఏ బాగోతం చేశాడో తెలుసని ఆ విషయం కూడా బయట పెడతామని హెచ్చరించారు. ఆదిరెడ్డి అప్పారావు దగ్గర ఏ లబ్దిపొందాడో తనకు, మాకు బాగా తెలుసని, క్వారీ యజమానుల మీద కేసు వేస్తూ, కంబాలపేటకు చెందిన ఒక యువకుడితో ఆదిరెడ్డి అప్పారావుపై కూడా కేసు వేయిస్తే ఏ యువకుడితో అయితే కేసు వేయించారో అతడే ఆదిరెడ్డి అప్పారావు ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పి వెళ్లారని, ఆ కేసు కూడా కొట్టివేయడం జరిగిందని వివరించారు. అవగాహన, ఆలోచన లేకుండా విమర్శలు చేస్తే మాత్రం తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. స్థానిక టీడీపీ నాయకులు దుత్తరపు గంగాధర్ మాట్లాడుతూ బర్రే కొండబాబు భూ దందాలు బయటపెడతామని ఆయన పట్టాలు ఇవ్వడానికి కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. కొండబాబు బీఎస్సీలో ఉన్నప్పుడు చేసిన విచిత్రమైన ప్రచారం గురించి తమ పేటలోని పిల్లలు ఇప్పటికీ అడుగుతుంటారని, ఊరులో ఏనుగులు శబ్దం చేసుకుంటూ ఆటోలు తెగ తిరిగాయని, ఇప్పుడు ఆ ఏనుగులు ఉన్న ఆటోలు ఎందుకు తిరగడం లేదని పిల్లలు అడుగుతుంటే వాటి స్థానంలో నగరంలోని ఒక ప్రజా ప్రతినిధి ఫొటోలు తిప్పుతున్నావని… ఆ ప్రజా ప్రతినిధి ఎక్కడ కనిపిస్తాడ్రా అంటే ఎక్కువగా వీడియోల్లో సోషల్ మీడియాలో బిల్డప్ బాబు గా కనిపిస్తారని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దొంగ కేసులు పెట్టడం, బెదిరించడం వంటి పనులు ఆయనకు అలవాటేనని, ఇకనైనా వద్ధతి మార్చుకోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు నేమాలి శ్రీను, జి. లక్ష్మణరావు, రాయవరపు కోటి, కోరి సీతామల్లేశ్వరి, తాడేపల్లి శ్రీను, దుత్తరపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Kondababu does not have that level

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *