డ్రీమ్ హోమ్ కన్స్ట్రక్షన్స్ ఇంజనీర్ కార్యాలయం ప్రారంభం-ముఖ్య అతిథిగా పాల్గొన్న కొండ్రెడ్డి రంగారెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:

డ్రీమ్ హోమ్ కన్స్ట్రక్షన్స్ ఇంజనీర్ నూతన కార్యాలయాన్ని విజయ పాల డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక మైపాడు రోడ్డు, వెంగళరెడ్డి  నగర్ ప్రాంతంలో లైసెన్సడ్ సివిల్ ఇంజనీర్ చినిగి పృథ్వి రాజ్ సింహపురి ప్రజలకు అందుబాటులో డ్రీమ్ హోమ్ కన్స్ట్రక్షన్స్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ పాల డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొని లాంఛనంగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహపురి ప్రజలు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకునే భవిష్యత్తు ప్రణాళిక  కార్యక్రమంలో భాగంగా ఇంటి నిర్మాణానికి అవసరమైన మున్సిపల్ పంచాయతీ నుడా అప్రూవల్స్ లతోపాటు ల్యాండ్ సర్వే ,బ్యాంక్ వెస్ట్మిషన్స్ తదితర సేవలను సరళమైన రీతిలో సకాలంలో అందించగల డ్రీమ్ హోమ్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఇంజనీర్ పృథ్వి రాజును సంప్రదించవలసినదిగా సూచించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ గృహస్థులకు తమ సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా డ్రీమ్ హోమ్ కన్స్ట్రక్షన్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయ పాల డైరీ చైర్మన్ రంగారెడ్డి పూల బొకే అందజేసి  శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తనయుడు ప్రేమ్, కార్యాలయ నిర్వాహక ఇన్చార్జి కళ్యాణ్ రాజ్ లతోపాటు వివిధ రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Kondreddy Rangareddy was the chief guest at the inauguration of the Dream Home Constructions Engineer’s Office

Leave A Reply

Your email address will not be published.