కొణిదెల టిడిపి సర్పంచి వైసిపి గూటికి.. ఎమ్మెల్యే ఆర్థర్ సమక్షంలో 200 మంది టిడిపి కార్యకర్త లు చేరిక

నందికొట్కూరు  ముచ్చట్లు:

నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సర్పంచి కొంగర నవీన్ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. గురువారం నందికొట్కూరు ఎమ్మెల్యే
తోగురు  ఆర్థర్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.గ్రామానికి చెందిన 200 మంది తెలుగుదేశం కార్యకర్తలకు వైసీపీ కండువా కప్పి వైసీపీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచి కొంగర నవీన్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు,  నచ్చి , గ్రామాభివృద్ధికి కోసం వైసిపి పార్టీలో చేరడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవ రత్నాలు, వైఎస్సార్ చేయూత, అమ్మవడి, రైతు బరో సా, విద్యా దీవెన , వైఎస్ఆర్ ఆసరా వంటి పథకాలు ప్రజలకు అందించడం, గ్రామాభివృద్ధికి పాటు పడడమే లక్ష్యంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లడుతూ…
ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నేరవేరుస్తున్నారని తెలిపారు. పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి సీఎం జగన్ ప్రతిక్షణం పేదల బాగోగుల కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం  ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో రాజన్న పాలన కొనసాగుతోందని  సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్ ముందుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని పేర్కొన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే అన్నారు.కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నామని.. అన్ని వర్గాలకు సమానంగా సంక్షేమ ఫలాలు అందించామని పేర్కొన్నారు. 20 ఏళ్లల్లో సాధించలేని అభివృద్ధిని రెండేళ్లలోనే సీఎం జగన్ చేసి చూపారన్నారు. మహా నేత వైఎస్ఆర్ అభివృద్ధి బాటలో సీఎం జగన్ నడిచారన్నారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమాన్ని అందించామని’’ఎమ్మెల్యే  ఆర్థర్ పేర్కొన్నారు.

గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శమైందని.. రాజ్యాంగ నిర్మాతలు కలలు గన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ సాకారం చేశారని తెలిపారు. నిజాయతీ, నిబద్ధతతో కూడిన వ్యవస్థను సీఎం జగన్ తన పాలనలో తెచ్చారని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల సీఎం జగన్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రైతు భరోసాతో రైతులను ప్రభుత్వం ఆదుకుంది. ఏ సంక్షేమ పథకం ఎప్పుడు అమలవుతుందో.. ఎప్పటికప్పుడు సీఎం జగన్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పు తెచ్చి నాడు-నేడు అమలు చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయికి తెచ్చి విద్య అందిస్తున్నాం. రాష్ట్ర ప్రజలను మొత్తం తన కుటుంబంగా సీఎం జగన్ భావిస్తున్నారు. విద్య, వైద్యం అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ప్రభుత్వం భావిస్తోంది. అప్పుల భారం పడకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు సీఎం జగన్ నడిపిస్తున్నార న్నారు. కార్యక్రమంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు చెరుకుచర్ల రఘు రామయ్య,సింగిల్ విండో అధ్యక్షుడు బాలస్వామి, ఉప సర్పంచి భాస్కర్ రెడ్డి ,మున్సిపల్ కౌన్సిలర్ లు  ధర్మరెడ్డి, వైసిపి నాయకులు  సుధాకర్ రెడ్డి, మాణిక్య రాజు, సాలే బాలన్న, రంగ స్వామి  , వైసీపీ  మహిళా విభాగం కార్యదర్శి వనజ  , మండల నాయకులు,శాతనకోట వెంకటేశ్వర్లు ,జగన్ రఫీ,దేశెట్టి , అయ్యన్న, తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Konidela TDP Sarpanchi to YCP Gooty ..
200 TDP activists in the presence of MLA Arthur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *