అభివృద్ధి జాడ లేని కొప్పర్తి-   డాక్టర్ నరెడ్డి తులసి రెడ్డి.

చింతకొమ్మదిన్నె ముచ్చట్లు:

 

కడప సమీపంలో ని కొప్పర్తి పారిశ్రామిక వాడ లో ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదని , ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నరెడ్డి తులసి రెడ్డి విమర్శించారు బుధవారం  కడప జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు  కడప జిల్లా సీకే దీన్నే మండలం కొప్పర్తి పారిశ్రామిక వాడ ను సందర్శించారు.కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.2021 డిసెంబర్ 23వ తేదీన వైయస్సార్ జగన్ అన్న మెగా ఇండస్ట్రీయల్ హబ్ పేరుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ ద్వారం ఆర్చి ,పైలాన్ ఆవిష్కరించారన్నారు.మూడు వేల 164 ఎకరాల్లో వైయస్సార్ జగన్ అన్న మెగా ఇండస్ట్రీయల్ హబ్, 816 ఎకరాల్లో వైయస్సార్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ , 104 ఎకరాల్లో ఎం ఎస్ ఎం ఈ పార్క్, అభివృద్ధి చేస్తామని, 35 వేల కోట్ల పెట్టుబడితో, లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని  చెప్పారన్నారు.

 

 

ఇప్పటికే ఆరు నెలలైనా ఏ మాత్రం పురోగతి లేదని ఆరోపించారు.కంపెనీల ఉనికి కానరావడం లేదన్నారు.నిరుద్యోగ యువత లో నిరాశా నిస్పృహలు అలుము కుంటున్నాయి అన్నారు.ఇప్పటికే ప్రారంభించిన డిక్సన్ కంపెనీ కార్యకలాపాలు సాగటం లేదు అన్నారు.మిగతా కంపెనీల ఊసే లేదు అన్నారు.జిల్లాలో పారిశ్రామిక ప్రగతి మూలన పడింది అని, ఉక్కు కర్మాగారం ఊసే లేదని, కొప్పర్తి పారిశ్రామికవాడ ప్రస్తావనే లేదని నేతలు అన్నారు.కార్యక్రమంలో నగర అధ్యక్షుడు విష్ణు ప్రీతం రెడ్డి, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ అహ్మద్, రాష్ట్ర నేతలు మల్లెం విజయ భాస్కర్, చీకటి చార్లెస్, జోడు నాగరాజు, ఆరీఫుల్లా, గాండ్ల కృష్ణమూర్తి, కర్నాటి చంద్రశేఖర్ రెడ్డి, తిరుమలేష్, సుబ్బారెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోటపాటి లక్ష్మయ్య, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు మామిళ్ల బాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్యామల దేవి, బీసీ జిల్లా చైర్మన్ కుల్లాయప్ప,జిల్లా ఉపాధ్యక్షుడు శర్మ, ప్రధాన కార్యదర్శి ఓబయ్య, మైన్ ఉద్దీన్, ప్రొద్దుటూరు నేత నజీర్, రామకృష్ణ, నరసింహారెడ్డి, అమర్, ఉత్పన్న, గౌరీ, అరుణ, లోకేశ్వరి, వేణుగోపాల్ ,వదూద్ ఖాన్, ప్రసాద్, సత్యం, రామిరెడ్డి పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Kopparthi without any trace of development- Dr. Nareddy Tulsi Reddy.

Post Midle