జర్నలిస్టుపై దాడి ఘటనలో కోటంరెడ్డి వివరణ 

Date:12/08/2019

నెల్లూరు ముచ్చట్లు:

జర్నలిస్టుపై దాడి ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వివరణ ఇచ్చారు. జర్నలిస్టు డోలెంద్ర ప్రసాద్ తనపై కావాలనే కేసు పెట్టారని, కస్తూరి దేవి స్కూల్ విషయం మాట్లాడాలని కోరితేనే ప్రసాద్ ఇంటికి వెళ్లానని తెలిపారు. డోలెంద్ర ప్రసాద్ను కొట్టాల్సిన అవసరం తనకు లేదని, తాను తప్పు చేసి ఉంటే స్వయం పోలీసులకు లొంగిపోతానని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చెప్పారు. దాడి ఘటనపై కోటంరెడ్డితో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం డోలేంద్ర ప్రసాద్ మీద దాడి చేసిన ఘటనపై కేసు నమోదయింది. అయితే వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి తీరుపై టీడీపీ, బీజేపీ, సీపీఎం పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మీడియాపై దాడులకు నిరసనగా జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. కోటంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కోటంరెడ్డిపై సీఎం జగన్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

శామీర్‌పేట సమీపం లో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

Tags: Kotam Reddy’s description of the attack on the journalist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *