ఇంద్రకీలాద్రి ముచ్చట్లు:
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కోటి దీపోత్సవాన్ని అత్యంత వైభ వంగా నిర్వహించారు.విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో ప్రదోషకాలంలో దీప ప్రజ్వ లనతో కోటి దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, కన్నుల పండుగ గా జరిగింది.ఆలయ ప్రాం గణంలో కోటి దీపాలను భక్తులు,ఆలయ సిబ్బం ది, బోర్డు సభ్యులు వెలిగించారు. దేదీప్యమైన వెలుగుల కాంతిరేఖల్లో ఇంద్రకీలాద్రి స్వర్ణ శోభితంగా వెలు గులు చిమ్మింది. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే చిన్న గోపురం వద్ద ఏర్పాటుచేసిన జ్వాలా తోరణం వద్ద ఆలయ వైదిక కమిటీ సభ్యులు, ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యం లో ప్రత్యేక పూజలు నిర్వ హించి జ్వాలాతోరణాన్ని వెలిగించారు. ఈ కోటిదిపోపోత్సవంలో పాల్గొనేందు కు, తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు ఆలయా నికి తరలివచ్చి,దీపాలు వెలిగించి అమ్మవారిని స్వామి వారి ని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.
Tags: Koti Dipotsavam in splendor