Natyam ad

అభివృద్ధికి ఆద్యుడు కోట్ల- ఘనంగా కోట్ల విజయ భాస్కర రెడ్డి 102 వ జయంతి

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

ఎమ్మిగనూరు పట్టణంలో  దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి  102 వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు  కోట్ల విజయ భాస్కర రెడ్డి చిత్ర పటమునకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంను రెండు కళ్లుగా భావించి ప్రగతి పథంలో ఎన్నో మైలురాళ్లు  సాధించి… పల్లె పల్లెకు తాగునీరు- సాగునీరు అందించడమే కాకుండా రోడ్లు, గృహాలు, విద్య, వైద్య, ఆరోగ్యం ప్రాధాన్యత ఇచ్చి రైతులకు భూమి హక్కు పత్రములను ఇచ్చిన ముఖ్యమంత్రి  భారతదేశంలోనే కోట్ల విజయభాస్కరరెడ్డి మొదటి వ్యక్తి అని తెలిపారు. పేదలకు రూ.1.90 పైసలకే కిలో బియ్యం పథకం, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టి న ఘనత కోట్ల దేనన్నారు. రైతులకు రూ.50/- లకే విద్యుత్ సరఫరా అందించడమే కాకుండా, బడుగు, బలహీన వర్గాలకు శాశ్వత గృహ నిర్మాణాలు చేపట్టి, మహిళలకే రేషన్ షాపులు కేటాయిస్తూ… వారి ఆత్మ గౌరవం కోసం ఏకంగా సారాను నిషేధించి, డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక సాధికారతకు కృషి చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు, కె.సి. కెనాల్,ఎల్.ఎల్.సి. ఆధునీకరణ పనులకు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా,5 సార్లు శాసన సభ్యులుగా, ఒక సారి శాసనమండలి సభ్యులుగా,6 సార్లు కర్నూల్ లోకసభ సభ్యుడు గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 సార్లు ముఖ్యమంత్రిగా,4 సార్లు కేంద్రమంత్రిగా   సేవలు అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. 1954,1955,1983 లలో  ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి మూడు సార్లు  శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించి ఎమ్మిగనూరు తో విడదీయరాని బంధం ఏర్పరుచుకున్నాడన్నారు.

 

Post Midle

*” పెద్దాయన “జీవిత చరిత్ర పుస్తకం
దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి గారి జీవిత చరిత్రను “పెద్దాయన”  పేరుతో  కదిరికోట ఆదెన్న రచనలో  రూపొందిస్తున్నట్లు కోట్ల క్యాంప్ ఆఫీస్ వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో… మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ మల్కాపురం నాగిరెడ్డి, బనవాసి ఆదినారాయణ రెడ్డి, కదిరికోట ఆదెన్న,  మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి. అల్తాఫ్, ఆం.ప్ర. రాష్ట్ర సగర (ఉప్పర ) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు,  అడ్వకేట్ కే.టి. మల్లికార్జున,  మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మాచాని శివకుమార్, బూదూరు రాఘవేంద్రరెడ్డి, యన్. సురేష్ కుమార్, ఎమ్మిగనూరు మండలం మాజీ ఆత్మ చైర్మన్  కందనాతి శ్రీనివాసులు, కడివెల్ల మాజీ ఎంపీటీసీ  పి.బి. లింగన్న, ఎరుకల మారెన్న, మేకల కర్రెన్న,  వెంకటాపురం బుడ్డన్న, నాగరాజు,  ముస్లిం మైనార్టీ నాయకులు కె.యం.డి. జబ్బార్, పీర్ బాషా, మహబూబ్ బాషా, ఆఫ్గన్ వల్లి భాష,  టౌన్ ఎస్సీ సెల్ నాయకులు రోజా ఆర్ట్స్ ఉసేని, సప్లయర్ బంగారప్ప,  దర్జీ మోషన్న, కంపాడు చిన్న రంగన్న, అల్వాల ప్రసాద్, యస్. సాల్మన్, జాలవాడి ఏసన్న, ఎమ్మిగనూరు మండలం నాయకులు మాచుమాన్ దొడ్డి శ్రీనివాసులు, పార్లపల్లి పాపారాయుడు,  గుడికల్ కొలంట్ల నాగరాజు, కె.  తిమ్మాపురం సోమప్ప, కందనాతి గ్రామం లక్ష్మణ స్వామి, బిక్కి రాముడు గోనెగండ్ల మండలం నాయకులు పెద్ద మరి వీడు గ్రామ మాజీ సర్పంచ్ దస్తగిరి, గోనెగండ్ల మాబు వలి, నందవరం మండలం నాయకులు రాయచోటి మారెప్ప,లోకయ్య, ఇశ్రాయేలు, కనకవీడు పెద్దఈరన్న, కోసిగి మండల నాయకులు కోసిగియ్య, కోట్ల క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ లు కె. శంకరన్న, యన్. ఆదెన్న, టిడిపి సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్ ముని స్వామి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Kotla, the pioneer of development – 102nd birth anniversary of Kotla Vijaya Bhaskara Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.