కోవాగ్జిన్ సెకండ్ ట్ర‌యిల్ స‌క్సెస్

Date:12/09/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

క‌రోనా వైరస్‌ మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రయోగాలు భారత్‌లోనూ తీవ్రంగా కొనసాగుతున్నాయి. స్వదేశీ వ్యాక్సిన్‌లు భారత్ బయోటెక్ కొవాగ్జిన్, జైడస్ కాడిలా క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. టీకా ప్రయోగాల్లో భారత్‌ బయోటెక్‌ మరో ముందడుగు వేసింది. తాము అభివృద్ధిచేసిన కొవాగ్జిన్‌ టీకా.. జంతువులపై ప్రయోగాల్లో సత్ఫలితాలు ఇచ్చిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వ్యాక్సిన్‌ డోసు ఇచ్చిన జంతువుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని తెలిపింది. అంతేకాదు, వ్యాక్సిన్‌తో ఎటువంటి దుష్ప్రభావం కలగలేదని పేర్కొంది.రెండో డోస్‌ ఇచ్చిన 14 రోజుల తర్వాత పరిశీలించామని.. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్‌ వృద్ధిని గణనీయంగా నియంత్రించినట్లు గుర్తించామని వివరించింది. వ్యాక్సిన్‌ ఇచ్చిన జంతువుల్లో వ్యాధి నియంత్రణ అద్భుతంగా ఉందని సంస్థ పేర్కొంది. తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ.. ఇటీవలే రెండోదశ ట్రయల్స్‌‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.కోవాక్సిన్ జంతువులపై అధ్యయన ఫలితాలను ప్రకటించడం భారత్ బయోటెక్ గర్వంగా భావిస్తోంది.. ఈ ఫలితాలు ప్రత్యక్ష వైరస్‌‌‌కు రక్షణ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి’ అని తెలిపింది. కొవాగ్జిన్‌ను కోతులపై ప్రయోగించామని తెలియజేసింది.

 

 

 

మొత్తం 20 కోతులను ఒక్కో సమూహంలో ఐదు చొప్పున నాలుగు సమూహాలుగా విభజించి వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహించింది.ఒక సమూహానికి ప్లేసిబో ఇవ్వగా, మూడు గ్రూపులు మూడు వేర్వేరు వ్యాక్సిన్ అభ్యర్థులతో 0-14 రోజులలో రోగనిరోధక శక్తిని పొందాయి. రెండో డోసు ఇచ్చిన 14 రోజుల తరువాత అన్ని కోతుల్లోనూ సార్స్-కోవి-2ను ప్రవేశపెట్టాం… తర్వాత డోసు పెంచడం, మూడోవారం పోస్ట్-ఇమ్యునైజేషన్ నుంచి యాంటీబాడీల తటస్థం చేయడం ద్వారా రక్షణ ప్రతిస్పందన గమనించాం’ అని పేర్కొంది.కాలు వేసిన సమూహాలలో సంక్రమణ అనంతర వారం రోజుల్లో గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల కణజాలాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా.. వైరస్‌ను గణనీయంగా నియంత్రించింది. టీకాలు వేసిన సమూహాలలో హిస్టోపాథలాజికల్ పరీక్ష ద్వారా న్యుమోనియాకు ఎలాంటి ఆధారాలు గుర్తించలేదు. ఇదే సమయంలో ప్లేసిబో సమూహం మాదిరిగా కాకుండా మధ్యస్థాయిలో న్యుమోనియా లక్షణాలు కనిపించాయి’ అని వివరించింది.

రోజుకు లక్ష  కేసులు

Tags:Kovaggin Second Trial Success

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *