Kovid‌ diagnostic tests for 198 people

198 మందికి కోవిడ్‌ నిర్థారణ పరీక్షలు

– 26 పాజిటివ్‌ కేసులు
– క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు

Date:18/09/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

స్థానికప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణంలో శుక్రవారం సంజీవని బస్సుద్వారా 198 మంది కి కోవిడ్‌ నిర్థరాణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి పవన్‌కుమార్‌ తెలిపారు. వీరిలో 26 పాజిటివ్‌ కేసులుగా నిర్థారించినట్లు పేర్కొన్నారు. చౌడేపల్లె-8 కేసులు,పరికిదొన -3,కొండయ్యగారిపల్లె-3,దిగువపల్లె-11,మదనపల్లె-1 కేసులను నిర్థారించామని, వీరిని క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకొన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవని ల్యాబ్‌ టెక్నీషియన్స్ సాయిక్రిష్ణ, నవీన్‌,ఏఎన్‌ఎంలు నాగలక్ష్మి, లత, హేమ, సుగుణ,లతోపాటు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఆర్‌ఫిఎఫ్‌ జవాను శ్రీనివాసులుకు వీడ్కోలు

Tags: Kovid‌ diagnostic tests for 198 people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *