కోవిడ్‌ మృతుల అంత్యక్రియలను అడ్డుకోరాదు

– జడ్జి బాబునాయక్‌

Date:21/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

Kovid‌ did not prevent the funeral of the dead

కరోనా బారిన పడి మృతి చెందిన వారి అంత్యక్రియలను అడ్డుకోవడం చట్టరీత్య నేరమని ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మండల్‌ లీగల్‌సర్వీసస్‌ అథారిటి చైర్మన్‌ , సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ హెచ్చరించారు.బుధవారం ఆయన ప్రజలు, న్యాయవాదులతో కలసి సదసు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ కరోనా మృతుల అంత్యక్రియలు అడ్డుకోవడం ఐపిసీ సెక్షన్‌ ప్రకారం 297, 341, 147 , 148 సెక్షన్ల క్రింద నేరమన్నారు. ఇలాంటి వాటిని అడ్డుకోవడం, వారి కుటుంబ సభ్యులను చులకనగా చూడటం చేయరాదన్నారు. ఇలాంటి వారిపై మండల్‌ లీగల్‌ సర్వీసస్‌ అథారిటికి సమాచారం అందించాలని కోరారు. అలాగే కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు శానిటైజర్లు, మాస్క్లు ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. వీటితో పాటు వ్యక్తిగత పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు పోలీస్‌, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

కార్మికుడికి ఆర్థిక సహాయం

Tags: Kovid‌ did not prevent the funeral of the dead

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *